శివ సంస్కారానికి నమస్కారం..

  • Publish Date - August 23, 2020 / 03:02 PM IST

Harish Shankar Hatsoff to Koratala Siva: మనం పడ్డ కష్టాన్ని, ఆ కష్టంలో మనకు సాయం చేసిన వారిని తద్వారా వచ్చిన ఫలితాన్ని మర్చిపోకూడదు అని పెద్దలు చెప్పేవారు. ఈ మాట రచయితగా కెరీర్ ప్రారంభించి దర్శకుడిగా మారి, సినిమా అనేది వినోద సాధనమో లేక వ్యాపారమో అనే ధోరణిలో కాకుండా తనవంతు బాధ్యతగా తన సినిమాల ద్వారా సమాజానికి సందేశమిస్తూ సెన్సేషనల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న కొరటాల శివకు చక్కగా సరిపోతుంది.

స్వతాహా మితభాషి అయిన కొరటాల తాను మాట్లాడరు కానీ తన సినిమాలు మాట్లాడతాయి.. తన గురించి తాను చెప్పుకోరు కానీ సినిమా పరిశ్రమ, ప్రేక్షకులు ఆయన గురించి మాట్లాడుకుంటారు. రచయితగా ఉన్నప్పుడు తను కొన్నిసార్లు మోసపోయాయని చెప్పే శివ తాను దర్శకుడయ్యాక ఎటువంటి భేషజాలకు వివాదాలకు పోకుండా తన పనేదో తాను చేసుకుంటుంటారు.
నాకు రాని వర్క్ కోసం ఎందరో సినిమాకు యాడ్ అవుతారు. వాళ్లంతా కష్టపడితేనే సినిమా నిలబడుతుంది. అలాంటప్పుడు సినిమా క్రెడిట్ మొత్తం నేను తీసుకోవడం కరెక్ట్ కాదు.. అని గతంలో చెప్పిన కొరటాల ఇప్పుడు ‘ఆచార్య’ విషయంలో మరోసారి ఆ మాటను నిరూపించారు.

ఆయన అంత సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అయినప్పటికీ.. తన గురించి కాకుండా.. మెగాస్టార్, మణిశర్మ కాంబో గురించి ట్వీట్ చేసి తన గొప్ప మనసు చాటుకున్నారు. తన సంస్కారాన్ని ప్రదర్శించారు. ఇప్పుడీ సంస్కారానికే దర్శకుడు హరీష్ శంకర్ నమస్కారం చెబుతూ.. కొరటాలకు హేట్సాఫ్ చెప్పారు.
‘‘తనొక టాప్ డైరెక్టర్ అయ్యుండి, ఒక సాధారణ ప్రేక్షకుడిలాగా.. let’s witness the combo of Megastar and Manisharma అని మ్యూజిక్ డైరెక్టర్‌కి గౌరవం ఇస్తూ ట్వీట్ చేయడంలో ఉన్న కొరటాల శివ సంస్కారానికి ఒక మనిషిగా నమస్కరిస్తూ, స్నేహితుడిగా అభినందిస్తున్నా… హేట్సాఫ్..’’ అని హరీష్ శంకర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.