Harnaaz Sandhu : మిస్ యూనివర్స్‌ని బాధపెడుతున్న వ్యాధి.. తినాలంటే కూడా ఆలోచించాల్సిందే

ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న హర్నాజ్ సందు మాట్లాడుతూ.. ''కెరీర్‌ మొదట్లో నేను చాలా సన్నగా ఉండేదాన్ని, ఇప్పుడు కొంచెం లావు అవుతున్నాను. దీంతో కొంతమంది నన్ను బాడీ షేమింగ్...

Harnaaj

Harnaaz Sandhu :  మన సెలబ్రిటీలు కూడా చాలా మంది అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కానీ బయటకి మాత్రం నవ్వుతూ మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు సెలబ్రిటీలు తమకు ఉన్న ఆరోగ్య సమస్యలని బయటపెడుతూ ఉంటారు. తాజాగా మరో సెలబ్రిటీ కూడా ఇలాగే తన బాధని పంచుకుంది. ఎన్నో ఏళ్ళ తర్వాత భారతదేశానికి మిస్ యూనివర్స్ కిరీటం తీసుకొచ్చిన హర్నాజ్ సందు కూడా ఓ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్టు తెలిపింది.

Raviteja : టైగర్ నాగేశ్వరరావు సినిమా లాంచ్

ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న హర్నాజ్ సందు మాట్లాడుతూ.. ”కెరీర్‌ మొదట్లో నేను చాలా సన్నగా ఉండేదాన్ని, ఇప్పుడు కొంచెం లావు అవుతున్నాను. దీంతో కొంతమంది నన్ను బాడీ షేమింగ్ చేస్తూ, లావుగా తయారయ్యానని ట్రోల్ చేస్తున్నారు. కానీ నేను సెలియాక్‌ అనే వ్యాధితో బాధపడుతున్నాను. ఈ విషయం ఎవరికీ తెలీదు. సెలియాక్‌ వ్యాధి వల్ల గోధుమ పిండి, బార్లీ లాంటి చాలా ఆహార పదార్థాలు తినలేను, తినేటప్పుడు కూడా ఆలోచిస్తూ తినాలి. మనస్ఫూర్తిగా నచ్చింది తినలేను. నా శరీరంపై ఎన్ని ట్రోల్స్‌ వచ్చినా ఎప్పుడూ నమ్మకంగా, ఆత్మవిశ్వాసంగా ఉంటాను” అని తెలిపింది.