Mahesh Babu : మహేష్ అన్న రమేష్ కొడుకు, కూతురిని చూశారా..

ఈ సంవత్సరం ఘట్టమనేని కుటుంబానికి చాలా గడ్డు కాలం నడిచింది అనే చెప్పాలి. ఏడాది మొదటిలో అన్నయ్య రమేష్ బాబుని కోల్పోయిన మహేష్ బాబు ఏడాది చివరిలో అమ్మ ఇందిరా దేవిని, తండ్రి కృష్ణని దూరం చేసుకొన్నాడు. అయితే మహేష్ అన్న రమేష్ చనిపోయిన తరువాత అయన కుటుంబం బయట ఎక్కడ కనిపించలేదు. తాజాగా కృష్ణ సంస్మరణ సభలో మొదటిసారి రమేష్ బాబు భార్య మరియు పిల్లలు కనిపించారు.

Mahesh Babu : ఈ సంవత్సరం ఘట్టమనేని కుటుంబానికి చాలా గడ్డు కాలం నడిచింది అనే చెప్పాలి. ఏడాది మొదటిలో అన్నయ్య రమేష్ బాబుని కోల్పోయిన మహేష్ బాబు ఏడాది చివరిలో అమ్మ ఇందిరా దేవిని, తండ్రి కృష్ణని దూరం చేసుకొన్నాడు. మంగళవారం గుండెపోటుతో మరణించిన కృష్ణ అంత్యక్రియలు బుధవారం అధికారిక లాంఛనాలు మధ్య మహాప్రస్థానంలో ముగిశాయి.

Mahesh Babu : తండ్రి గుండె ఆగిన రోజే.. మరో గుండెకు ఊపిరి పోశాడు.. మహేష్ బాబు!

ఇక నిన్న కృష్ణ మూడోవ రోజు సంస్మరణ దినోత్సవం నిర్వహించగా.. కుటుంబసభ్యులతో పాటు ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు హాజరయ్యి స్వర్గీయ కృష్ణకి శ్రద్ధాంజలి ఘటించారు. అయితే మహేష్ అన్న రమేష్ చనిపోయిన తరువాత అయన కుటుంబం బయట ఎక్కడ కనిపించలేదు. తాజాగా కృష్ణ సంస్మరణ సభలో మొదటిసారి రమేష్ బాబు భార్య మరియు పిల్లలు కనిపించారు.

అయితే బాబాయ్ మహేష్ బాబుతో కలిసి రమేష్ కొడుకు మరియు కూతురు దిగిన ఫోటోలు బయటకి వచ్చాయి. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. కాగా మహేష్ తన తండ్రి చనిపోయిన రోజు కూడా మరో కుటుంబంలో దీపం వెలిగించాడు. మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా మోక్షిత్ సాయి అనే చిన్నారికి గుండె ఆపరేషన్ కి సాయం చేసి గొప్ప మనుసుని చాటుకున్నాడు.

Have you seen Mahesh Babu Brother Ramesh’s son and daughter?

Family Members and Industry Persons are pay last rites to krishna

 

 

ట్రెండింగ్ వార్తలు