Mahesh Babu : తండ్రి గుండె ఆగిన రోజే.. మరో గుండెకు ఊపిరి పోశాడు.. మహేష్ బాబు!

సూపర్ స్టార్ మహేష్ బాబు కష్ట సమయంలో కూడా సాయం చేసి దేవుడిలా నిలుస్తున్నాడు. తన తండ్రి కృష్ణ గుండె ఆగిన రోజే, మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా మరో గుండెకు ఊపిరి పోశాడు. డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ కార్డియాక్ అరెస్ట్ తో సోమవారం హాస్పిటల్ అడ్మిట్ అయిన సంగతి మనందరికి తెలిసిందే. అదే రోజు మోక్షిత్ సాయి అనే బాలుడు కూడా గుండె సమస్యతో విజయవాడ రమేష్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు.

Mahesh Babu : తండ్రి గుండె ఆగిన రోజే.. మరో గుండెకు ఊపిరి పోశాడు.. మహేష్ బాబు!

On the day his father's heart stopped Mahesh Babu gave breath to another heart

Updated On : November 18, 2022 / 11:03 AM IST

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు కష్ట సమయంలో కూడా సాయం చేసి దేవుడిలా నిలుస్తున్నాడు. తన తండ్రి కృష్ణ గుండె ఆగిన రోజే, మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా మరో గుండెకు ఊపిరి పోశాడు. డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ కార్డియాక్ అరెస్ట్ తో సోమవారం హాస్పిటల్ అడ్మిట్ అయిన సంగతి మనందరికి తెలిసిందే. అదే రోజు మోక్షిత్ సాయి అనే బాలుడు కూడా గుండె సమస్యతో విజయవాడ రమేష్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు.

Mahesh Babu: దుఃఖంలోనూ మహేశ్‌ను నవ్వించిన బాలయ్య.. హ్యాట్సాఫ్ అంటోన్న అభిమానులు!

మోక్షిత్ సాయి గుండెకు రంద్రాలు ఉండడంతో డాక్టర్లు సర్జరీ చేయాలని చెప్పారు. ఆర్ధిక సాయం లేకపోవడంతో మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఆ చిన్నారి వైద్యానికి అవసరమైన సదుపాయాలు కలిపించాడు మహేష్. ఆ ఆపరేషన్ సక్సెస్ అవ్వడంతో చిన్నారి మోక్షిత్ సాయి ప్రాణాలు నిలబడ్డాయి. కానీ అదే రోజు మహేష్ బాబు తన తండ్రిని గుండె సంబంధిత సమస్యతో కోలుపోవడం బాధాకరం.

ఇక ఇంతటి బాధాకర సమయంలో కూడా మహేష్ చేసిన సాయం తెలుసుకున్న అభిమానులు మరియు నెటిజెన్లు.. ‘దైవం మానుషు రూపేణా’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా నిన్న కృష్ణ మూడోవ రోజు సంస్మరణ దినోత్సవం జరిగింది. ఈ కారిక్రమానికి మహేష్ బాబు కుటుంబ సభ్యులతో పాటు ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు హాజరయ్యి కృష్ణకి శ్రద్ధాంజలి ఘటించారు.