Honeymoon Express : ఆహాలో కూడా దూసుకుపోతున్న హెబ్బాపటేల్ రొమాంటిక్ సినిమా..

ప్రస్తుతం ఈ సినిమా ఆహాలో దుమ్ములేపుతోంది.

Hebah Patel Honeymoon Express Movie getting Good Response in Aha OTT

Honeymoon Express : చైతన్యరావు, హెబ్బా పటేల్ జంటగా బాల రాజశేఖరుని దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’. ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 21న థియేటర్స్ లో రిలీజయి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఆకట్టుకుంది.

హనీమూన్ ఎక్స్‌ప్రెస్ సినిమాలో తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రలు పోషించారు. పెళ్లి తర్వాత సమస్యలు వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలి అనే కథని రొమాంటిక్ ఎంటర్టైనర్ గా చూపించారు ఈ సినిమాలో. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా టాప్‌లో ట్రెండ్ అవుతూ ఆల్రెడీ 70 మిలియన్ల మినిట్స్ వ్యూస్‌ను క్రాస్ చేసింది.

Also Read : Tejaswini Nandamuri : బాలయ్య రెండో కూతురు.. మొదటిసారి మీడియా ముందుకు.. ఎంత బాగా మాట్లాడిందో..

ప్రస్తుతం ఈ సినిమా ఆహాలో దుమ్ములేపుతోంది. గత కొన్ని రోజులుగా హనీమూన్ ఎక్స్‌ప్రెస్ సినిమా ఆహాలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. బిగ్ ఫిష్ సినిమాస్ ఈ సినిమాని ఓటీటీలోకి తీసుకొచ్చింది. ప్రస్తుత తరం ఎదుర్కొంటోన్న ప్రేమ, పెళ్లి, విడాకులు కాన్సెప్టుల మీద అందరినీ ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుంది. ఎవరైనా ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ని మిస్ అయితే ఆహా ఓటీటీలో చూసేయండి.