Hebah Patel : ‘ది గ్రేట్ ఇండియన్ సూసైడ్’.. హెబ్బా పటేల్ తల తీసేసి.. ఆహాలో సరికొత్తగా..

ఆస‌క్తిక‌ర‌మైన మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ సినిమా అయిన 'ది గ్రేట్ ఇండియ‌న్ సూసైడ్' తో రెడీ అయింది ఆహా. వెన్నులో వ‌ణుకుపుట్టించే ఉత్కంఠ‌భ‌రిత‌మైన థ్రిల్ల‌ర్‌గా...

Hebah Patel : ‘ది గ్రేట్ ఇండియన్ సూసైడ్’.. హెబ్బా పటేల్ తల తీసేసి.. ఆహాలో సరికొత్తగా..

Hebah Patel New Movie coming soon in Telugu OTT Aha

Hebah Patel : తెలుగు ఓటీటీ ఆహా(Aha OTT) ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్ లు, షోలు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆస‌క్తిక‌ర‌మైన మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ సినిమా అయిన ‘ది గ్రేట్ ఇండియ‌న్ సూసైడ్’ తో రెడీ అయింది ఆహా. వెన్నులో వ‌ణుకుపుట్టించే ఉత్కంఠ‌భ‌రిత‌మైన థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కింది ది గ్రేట్ ఇండియ‌న్ సూసైడ్. అక్టోబ‌ర్ 6 నుంచి ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవ్వనుంది. రామ్ కార్తిక్‌, హెబా ప‌టేల్ కీల‌క పాత్ర‌ల్లో విప్ల‌వ్ కోనేటి ద‌ర్శ‌క‌నిర్మాత‌గా ఈ సినిమా తెరకెక్కింది. శ్రీచ‌ర‌ణ్ పాకాల దీనికి సంగీతం అందించారు. న‌రేష్, ప‌విత్రా లోకేష్‌.. తో పాటు ప‌లువురు ప్రముఖులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో క‌నిపిస్తారు.

ఓ కుటుంబం ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డాల‌నుకుంటుంది. అస‌లు వాళ్ల ఉద్దేశం ఏంటి? మ‌ళ్లీ పుట్ట‌డ‌మేనా? అనే సరికొత్త కథతో రాబోతుంది ది గ్రేట్ ఇండియ‌న్ సూసైడ్. క‌థ‌లో ముందుకెళుతున్న కొద్దీ అనూహ్య‌మైన ట్విస్టులు, స‌స్పెన్స్, డ్రామా, రొమాన్స్… ఇలాంటివి ఎన్నెన్నో ఉంటాయని సమాచారం. మ‌ద‌న‌ప‌ల్లి టౌన్‌లో జ‌రిగిన వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ ది గ్రేట్ ఇండియ‌న్ సూసైడ్ తెరకెక్కినట్టు తెలుస్తుంది.

Also Read : Akhil Akkineni : అఖిల్ కోసం వస్తున్న రాజమౌళి.. అయ్యగారు ఈ సారైనా హిట్ కొడతారా?

ఇటీవల హెబ్బా ప‌టేల్ న‌టించిన ఓదెల రైల్వే స్టేష‌న్ క్రైమ్ థ్రిల్ల‌ర్ సినిమా ఆహాలో అద్భుతంగా ఆక‌ట్టుకుంటోంది. ఇప్పుడు ది గ్రేట్ ఇండియ‌న్ సూసైడ్ తో మ‌ళ్లీ ఆహా ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌నున్నారు హెబ్బా ప‌టేల్‌. రీసెంట్‌గా మ‌ళ్లీ పెళ్లితో ఆహా ఆడియ‌న్స్ ని అల‌రించిన న‌రేష్ వీకే, ప‌విత్రా లోకేష్ కూడా ది గ్రేట్ ఇండియ‌న్ సూసైడ్ లో కూడా భార్య భర్తలుగా న‌టించారు. అక్టోబర్ 6 నుంచి ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవ్వనుంది. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ మొదలుపెట్టనున్నారు.