Hebah Patel Ram Karthik new Movie Streaming in Aha OTT inspiring from true stories
Hebah Patel Movie : రామ్‌కార్తిక్, హెబ్బాపటేల్ జంటగా నటించిన నటించిన సినిమా ది గ్రేట్ ఇండియన్ సూసైడ్. ప్రతి వారం కొత్త కొత్త సినిమాలను, సిరీస్ లను అందిస్తున్న తెలుగు ఓటీటీ ఆహాలో నేడు ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా రిలీజైంది. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు విప్లవ్ కోనేటి దర్శకత్వం వహించాడు. యథార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.
కథ విషయానికి వస్తే.. హేమంత్ (రామ్‌కార్తిక్) ఓ అనాథ. తన స్నేహితుడితో కలిసి కాఫీషాప్ రన్ చేస్తుంటాడు. అతడి షాప్‌కు కుకీస్ సప్లై చేస్తుంటుంది చైత్ర (హేభాపటేల్). కొన్ని రోజుల పరిచయంలో చైత్రతో ప్రేమలో పడతాడు హేమంత్. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ చైత్ర మాత్రం అతడిలి నో చెబుతుంది. కొద్ది రోజుల్లో తమ ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకోనున్నట్లు చెప్పి షాకిస్తుంది. యాక్సిడెంట్‌లో చనిపోయిన తమ పెదనాన్న బళ్లారి నీలకంఠయ్యను(సీనియర్ నరేష్)ను తిరిగి బతికించడానికి తాము ఆత్మతర్పణం చేసుకుంటున్నామని అంటుంది. దీంతో చైత్రతో పాటు ఆమె ఫ్యామిలీ మొత్తాన్ని సేవ్ చేయాలని హేమంత్ ఫిక్స్ అయి చైత్ర మెడలో తాళికట్టి ఆమె ఇంట్లో అడుగుపెడతాడు. చైత్ర ఇంట్లో అతడికి ఎలాంటి అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయి? చైత్ర కుటుంబసభ్యులను నీలకంఠయ్య ఆవహించేది నిజమేనా? ఆత్మహత్య చేసుకోకుండా వాళ్ళని హేమంత్ కాపాడగలిగాడా? ఆ కుటుంబాన్ని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించింది ఎవరు? తనకు జరిగిన అన్యాయంపై చైత్ర ఎలా ప్రతీకారం తీర్చుకున్నది? అనేది ఓటీటీలో చూడాల్సిందే.
ఓ యువకుడు సాగించిన జర్నీ నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ మూవీ సాగుతుంది. చివరలో రివేంజ్ డ్రామాతో పాటు తెలిసినవాళ్ల చేతుల్లోనే చిన్న పిల్లలు ఎక్కువగా లైంగికదాడులకు గురువుతున్నారనే సందేశాన్ని ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే స్వామిజీలుగా అవతారం ఎత్తి కొందరు చేసే అకృత్యాల్ని ఆలోచనాత్మకంగా సినిమాలో చూపించారు.
మూఢనమ్మకాల వల్ల తలెత్తే అనర్థాల్ని కమర్షియల్ యాంగిల్‌లో చెప్పాలని లవ్‌స్టోరీతో సినిమాను మొదలుపెట్టి ఆ తర్వాత అసలైన కథలోని వెళ్లారు డైరెక్టర్. చైత్ర ఇంట్లో హేమంత్ అడుగుపెట్టిన తర్వాత అక్కడ అతడికి ఎదురయ్యే పరిణామాలు థ్రిల్లింగ్‌ను పంచుతాయి. ఫ్యామిలీ మిస్టరీని సాల్వ్ చేసేందుకు హేమంత్ చేసే ప్రయత్నాలతో ఒక్కో ట్విస్ట్ ను రివీల్ చేస్తూ క్లైమాక్స్ వరకు ఉత్కంఠభరితంగా సినిమా సాగుతుంది. నచ్చితే నమ్మకం…నచ్చకపోతే మూఢనమ్మకం అంటూ వచ్చే కొన్ని డైలాగ్స్ మెప్పిస్తాయి. ప్రేక్షకులను తన స్క్రీన్ ప్లేతో మెప్పించి తక్కువ బడ్జెట్లో క్వాలిటీ ఫిల్మ్ తీశారు. దీనికి పార్ట్ 2 కూడా ప్లాన్ చేయడం విశేషం. మ్యూజిక్ చాలా బాగా ప్లస్ అయింది ఈ సినిమాకు. సినిమా పాయింట్ కొత్తగా ఉన్నా అక్కడక్కడా మాత్రం బోర్ ఫీలింగ్, సాగదీసినట్టు అనిపిస్తుంది. ఈ సినిమాకు రేటింగ్ 3 వరకు ఇవ్వొచ్చు.
Brathakaleka Suicide kaadu…
Thirigi Bathukuthamane Suicide! ?#TheGreatIndianSuicideOnAHA Streaming Now▶️https://t.co/vdplo9tk9C pic.twitter.com/YCBWwYllVT— ahavideoin (@ahavideoIN) October 6, 2023