Hema Chandra
Hema Chandra : ఒకప్పుడు టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్స్ జంటలలో సింగర్స్ శ్రావణ భార్గవి – హేమచంద్ర ఒకటి. సింగర్స్ గా ఈ ఇద్దరూ మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రేమించే పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి ఒక పాప కూడా ఉంది. అయితే ఈ జంట ఓ మూడేళ్ళ క్రితమే విడిపోయారు. కానీ ఈ విషయం ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. ఎవరికి వారు నివసిస్తూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. శ్రావణ భార్గవి – హేమ చంద్ర విడిపోయారని వాళ్ళు పెట్టే సోషల్ మీడియా పోస్టులతో అందరికి క్లారిటీ వచ్చేసింది.(Hema Chandra)
కానీ దీనిపై ఈ ఇద్దరూ ఇప్పటివరకు ఎక్కడా స్పందించలేదు. తాజాగా హేమచంద్ర ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా విడాకుల ప్రశ్న ఎదురైంది. మీ పెళ్లి జీవితం పై చాలా రూమర్స్ ఉన్నాయి, కామెంట్స్ వస్తున్నాయి కానీ మీరు స్పందించట్లేదు, క్లారిటీ ఇవ్వట్లేదు అని అడిగారు.
Also See : Anasuya Bharadwaj : స్లీవ్ లెస్ బ్లౌజ్ లో చీరకట్టుతో.. అనసూయ అందాలు..
దీనిపై హేమచంద్ర మాట్లాడుతూ.. వార్తలు ఏదైనా సరే అది నిజమా కాదా పక్కన పెడితే దానివల్ల నీకు ఏమైనా పనికొస్తదా, అది తెలుసుకోవడం వల్ల నీకేమైనా ఉపయోగం ఉందా అంటే చెప్పు చెప్తా. నా పై వచ్చే కామెంట్స్ ని నేను కేర్ చెయ్యను, అవి నన్ను ఎఫెక్ట్ చెయ్యవు. అవి నిజమా కదా అనేది నేనెందుకు రెస్పాండ్ అవ్వాలి. నేను సింగర్ గా తెలుసు.. దాని గురించి అడుగు. చాలా మంది ఏదో ఒక రకంగా వార్తల్లో ఉండాలి అని అనుకుంటారు కానీ నేను ఆ టైప్ కాదు. నేను మాట్లాడితే కనీసం ఒకరైనా ఇన్ స్పైర్ అవ్వాలి. బేవర్స్ మాటలకు సమయం లేదు.
ఎవరైనా దాని గురించి తెలుసుకోవాలనుకుంటే ఒక Q & A సెషన్ పెడదాం. వాళ్ళను ఒకటే ప్రశ్న అడుగుతాను. ఈ విషయం నీకు ఎందుకు ఉపయోగపడుతుంది అని. వాళ్ళు చెప్పిన ఆన్సర్ నాకు నచ్చితే అప్పుడు సమాధానం చెప్తాను. వాళ్ళు అనే మాటలు పట్టించుకునేంత టైం నాకు లేదు. జనాలు పక్కనోళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తారు. నువ్వు ఒకరికి వర్క్ వల్ల తెలిస్తే దాని గురించే మాట్లాడు. వాళ్ల పర్సనల్ లైఫ్ ఎందుకు. ఒకవేళ నిజంగా అంతగా తెలుసుకోవాలనుకుంటే నాకు టైం ఉన్నప్పుడు మాట్లాడతాను అప్పటి వరకు వెయిట్ చేయి అని అన్నారు. దీంతో హేమచంద్ర వ్యాఖ్యలు వైరల్ అవ్వగా ఈ జంట ఎందుకు విడిపోయారు, అసలు విడిపోయారా లేదా అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు అనే అంటున్నారు.
Also Read : Andhra King Taluka Review : ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ మూవీ రివ్యూ.. ఫేవరేట్ హీరో కోసం అభిమాని ఏం చేసాడు..?