×
Ad

Hema : ఆ బాధతోనే మా అమ్మ చనిపోయింది.. డ్రగ్స్ కేసు గురించి మాట్లాడుతూ హేమ ఎమోషనల్..

ఇటీవలే హేమ తల్లి లక్ష్మి నవంబర్ 17న మరణించింది. (Hema)

Hema

Hema : లేడీ కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ కొన్నాళ్ల క్రితం బెంగుళూరులో ఓ రేవ్ పార్టీలో పాల్గొనడంతో డ్రగ్స్ తీసుకుంది అనే ఆరోపణలు వచ్చాయి. అప్పుడే పోలీసులు అరెస్ట్ చేయడంతో జైలుకెళ్ళొచ్చింది. అప్పట్నుంచి హేమ ఎక్కువగా సినిమాలు చెయ్యట్లేదు.(Hema)

ఇటీవలే హేమ తల్లి లక్ష్మి నవంబర్ 17న మరణించింది. హేమ మీద వచ్చిన ఆరోపణలు, ఆమె జైలుకి వెళ్లడం వల్లే తన తల్లి అనారోగ్యానికి గురయింది అని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది హేమ. తాజాగా హేమ ఆ డ్రగ్స్ కేసులో నిర్దోషి అని కోర్టు ఆ కేసుని కొట్టేసింది. దీంతో హేమ మీడియాతో మాట్లాడింది.

Also Read : CM Revanth Reddy – Allu Arjun : మరోసారి సీఎం రేవంత్ – అల్లు అర్జున్ ఒకే స్టేజిపై.. ఆ హీరో కోసం..

హేమ మాట్లాడుతూ.. నేను నిర్దోషినని కోర్టు నాపై ఉన్న కేసు కొట్టేసింది. బెంగళూరు హైకోర్టు నా మీద ఉన్న కేసును క్వాష్ చేశారు. నవంబర్ 3నే జడ్జిమెంట్ వచ్చింది కానీ ఇప్పుడు జడ్జిమెంట్ కాపీ నా చేతికి వచ్చింది. అందుకే ఇపుడు నేను ఎనౌన్స్ చేస్తున్నాను. దీనిపై సోషల్ మీడియాలో నా పై తెగ దుష్ప్రచారం చేశారు. ఆ బాధతో మా అమ్మ చనిపోయింది. సోషల్ మీడియాలో నా పై జరిగిన దుర్మార్గపు ప్రచారానికి సంవత్సరం నుంచి నేను నరకయాతన అనుభవిస్తున్నాను. నేను కాదు అని చెప్పినా కూడా కొందరు అసత్య ప్రచారాలు చేశారు. ఎట్టకేలకు నేను నిర్దోషినని కోర్టు తీర్పు ఇచ్చింది. నాపై జరిగిన దుష్ప్రచారం వల్లే మా అమ్మ బాధపడి అనారోగ్యానికి గురయి మరణించింది అంటూ ఎమోషనల్ అయింది.

Also Read : Varanasi : వామ్మో.. రాజమౌళి – మహేష్ సినిమా బడ్జెట్ అన్ని కోట్లా? బన్నీ – అట్లీ సినిమాకు మించి..