CM Revanth Reddy – Allu Arjun : మరోసారి సీఎం రేవంత్ – అల్లు అర్జున్ ఒకే స్టేజిపై.. ఆ హీరో కోసం..
సీఎం రేవంత్ - అల్లు అర్జున్ మరోసారి కలిసి కనిపించనున్నారు. ఈ ఇద్దరూ ఒకే వేదికపైకి రాబోతున్నారు. (CM Revanth Reddy - Allu Arjun)
CM Revanth Reddy - Allu Arjun
CM Revanth Reddy – Allu Arjun : గతంలో పుష్ప 2 సినిమా సమయంలో జరిగిన తొక్కిసలాట సంఘటనపై సీఎం రేవంత్ రెడ్డి – అల్లు అర్జున్ వారి వారి కోణాల్లోంచి మాట్లాడిన మాటలతో వైరల్ అయ్యారు. అనంతరం ఈ ఇద్దరూ కలిసి తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల వేడుకలో కనిపించారు. పుష్ప 2 సినిమాకు గాను అల్లు అర్జున్ గద్దర్ అవార్డుని సీఎం రేవంత్ చేతుల మీదుగా అందుకున్నారు. అప్పట్లో సీఎం రేవంత్ – అల్లు అర్జున్ కలిసిన ఫోటోలు వైరల్ గా మారాయి.
అయితే సీఎం రేవంత్ – అల్లు అర్జున్ మరోసారి కలిసి కనిపించనున్నారు. ఈ ఇద్దరూ ఒకే వేదికపైకి రాబోతున్నారు. అది కూడా ఒక హీరో కోసం ఈ ఇద్దరూ కలిసి రాబోతున్నారు.
Also Read : Varanasi : వామ్మో.. రాజమౌళి – మహేష్ సినిమా బడ్జెట్ అన్ని కోట్లా? బన్నీ – అట్లీ సినిమాకు మించి..
ఇంతకీ సీఎం రేవంత్ – అల్లు అర్జున్ ఎవరి కోసం వస్తున్నారో తెలుసా? మన బాలయ్య బాబు కోసం. బాలకృష్ణ అఖండ 2 సినిమాతో డిసెంబర్ 5న రాబోతున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ – సీఎం రేవంత్ రెడ్డిలు గెస్ట్ లుగా రాబోతున్నారట. బన్నీ ఆల్రెడీ వస్తాడని ఫిక్స్ అయిందట. సీఎం రేవంత్ తో మంతనాలు జరుగుతున్నాయని, బాలయ్య – సీఎం రేవంత్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే కాబట్టి బాలకృష్ణ కోసం వస్తారని సమాచారం.
దీంతో మరోసారి అల్లు అర్జున్ – తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఒకేసారి స్టేజిపై చూడొచ్చు. వీరితో పాటు బాలయ్య బాబు వేదికను పంచుకొన్నారు. ఇదే జరిగితే సినిమా మీదే కాదు ఈవెంట్ మీద కూడా మంచి హైప్ నెలకొంటుంది. ఈ ఈవెంట్ ఫోటోలు, వీడియోలు వైరల్ అవ్వడం ఖాయం అంటున్నారు అభిమానులు.
Also Read : Bunny Vasu : ఐ బొమ్మకు సపోర్ట్.. వాళ్లకు కౌంటర్ ఇచ్చిన బన్నీ వాసు.. ఆ సినిమాలు కూడా పైరసీ అవుతున్నాయిగా..
గతంలో బాలయ్య – అల్లు అర్జున్ కలిసి ఒకే వేదికపై చాలా సార్లు కనిపించారు. అఖండ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చారు. బాలయ్య అన్ స్టాపబుల్ షోకి కూడా అల్లు అర్జున్ వచ్చారు. గద్దర్ అవార్డుల వేడుకలో కూడా బాలయ్య – అల్లు అర్జున్ – సీఎం రేవంత్ కలిసి కనిపించారు.

