Varanasi : వామ్మో.. రాజమౌళి – మహేష్ సినిమా బడ్జెట్ అన్ని కోట్లా? బన్నీ – అట్లీ సినిమాకు మించి..
మహేష్ - రాజమౌళి సినిమా వారణాసి బడ్జెట్ గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది. (Varanasi)
Varanasi
Varanasi : రాజమౌళి – మాహేష్ కాంబోలో వారణాసి సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసి భారీ అంచనాలు పెంచారు. ఇక ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే వారణాసి సినిమా మూడు షెడ్యూల్స్ షూటింగ్స్ అవ్వగా త్వరలో రామోజీ ఫిలిం సిటీలో వేసిన వారణాసి సెట్ లో షూటింగ్ జరగనుంది.(Varanasi)
తాజాగా ఈ సినిమా గురించి ఒక వార్త వైరల్ గా మారింది. మహేష్ – రాజమౌళి సినిమా వారణాసి బడ్జెట్ గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది. టాలీవుడ్ సమాచారం ప్రకారం వారణాసి సినిమా బడ్జెట్ ఏకంగా 1200 కోట్లు అని తెలుస్తుంది. గతంలో ఈ సినిమాకు 800 కోట్ల బడ్జెట్ వరకు పెడుతున్నారని తెలిసింది. కానీ ఇప్పుడు ఆ బడ్జెట్ కాస్తా పెరిగింది.
Also Read : Bunny Vasu : ఐ బొమ్మకు సపోర్ట్.. వాళ్లకు కౌంటర్ ఇచ్చిన బన్నీ వాసు.. ఆ సినిమాలు కూడా పైరసీ అవుతున్నాయిగా..
అందుకే రాజమౌళి కూడా ఇన్వెస్టర్స్ ని తెచ్చి తన కొడుకుని ఈ సినిమాకు నిర్మాతగా మారాడు. అలాగే ఈ సినిమాకు బడ్జెట్ కోసం రాజమౌళి వార్నర్ బ్రోస్, నెట్ ఫ్లిక్స్ లాంటి హాలీవుడ్ సంస్థల దగ్గరకు కూడా నిర్మాణంలో భాస్వామ్యం కావాలని వెళ్లి అడిగారట. ఇటీవల జరిగిన వారణాసి లాంచ్ ఈవెంట్ కి హాలీవుడ్ నుంచి దాదాపు 15 మంది రిపోర్టర్స్ ని కూడా తెప్పించి ఇక్కడ వారణాసి సినిమా రేంజ్ ఎలా ఉందో చూపించారట. దీనివల్ల హాలీవుడ్ లో ఈ సినిమాని ప్రమోట్ చేసి ఇన్వెస్టర్స్ ని తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి.
1200 కోట్లు అనేది భారీ బడ్జెట్. ఇప్పటివరకు అంత భారీ బడ్జెట్ తో ఇండియాలో ఏ సినిమా తెరకెక్కలేదు. RRR, రోబో, కల్కి, కెజిఎఫ్.. ఇలాంటి భారీ సినిమాలు కూడా 400 నుంచి 600 కోట్లలో తీసేసారు. ఇటీవల అల్లు అర్జున్ – అట్లీ సినిమాకు 800 కోట్లు బడ్జెట్ పెడుతున్నారని, టైం ట్రావెల్, సై ఫై సినిమా అని, హాలీవుడ్ లో ఈ సినిమాకు వర్క్ చేయిస్తున్నారని సమాచారం వచ్చింది. దీంతో బన్నీ సినిమాని ఇండియాలో టాప్ బడ్జెట్ అనుకున్నారు. ఇప్పుడు దాన్ని మించి రాజమౌళి – మహేష్ బాబు సినిమా ఏకంగా 1200 కోట్లతో తెరకెక్కిస్తున్నారు. 1200 కోట్లతో తెరకెక్కుతుంది అంటే ఈ సినిమా హిట్ అవ్వాలంటే కనీసం 2500 కోట్ల గ్రాస్ అయినా వసూలు చేయాలి. ఈ సినిమాకు 3000 కోట్లు కలెక్షన్ టార్గెట్ పెట్టుకున్నారట మూవీ యూనిట్.
Also Read : Manchu Manoj : ఇకపై సంగీతంలో కూడా.. మంచు మనోజ్ సరికొత్త ప్రారంభం..
