Manchu Manoj : ఇకపై సంగీతంలో కూడా.. మంచు మనోజ్ సరికొత్త ప్రారంభం..

తాజాగా మనోజ్ మరో కొత్త వెంచర్ మొదలుపెట్టనున్నాడు.(Manchu Manoj)

Manchu Manoj : ఇకపై సంగీతంలో కూడా.. మంచు మనోజ్ సరికొత్త ప్రారంభం..

Manchu Manoj Started New Venture Mohana Raga Music

Updated On : November 22, 2025 / 3:32 PM IST

Manchu Manoj : హీరోగా ఒకప్పుడు వరుస సినిమాలు చేసి రాకింగ్ స్టార్ గా పేరు తెచ్చుకున్న మనోజ్ మధ్యలో కొన్నాళ్ళు సినిమాలకు దూరమైనా ఇటీవల మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు హీరోగానే కాక విలన్ గా, కీలక పాత్రల్లో నటిస్తూ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. మంచు మనోజ్ సినిమాల్లో నటించడమే కాకుండా కొన్నాళ్ల క్రితం తన భార్యతో కలిసి బొమ్మల బిజినెస్ కూడా మొదలుపెట్టాడు. తాజాగా మనోజ్ మరో కొత్త వెంచర్ మొదలుపెట్టనున్నాడు.(Manchu Manoj)

మంచు మనోజ్ తన కొత్త మ్యూజిక్ ప్రాజెక్ట్ ‘మోహన రాగ మ్యూజిక్’ను ప్రారంభించబోతున్నట్లు తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. మనోజ్ కి సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. గతంలో పోటుగాడు సినిమాలో ‘ప్యార్ మే పడిపోయానే..’ అనే పాటను పాడాడు. కరోనా స‌మ‌యంలో కూడా అంద‌రినీ ఉత్తేజ‌ర‌ప‌రిచేలా ‘అంతా బాగుంటాంరా..’ అనే పాట‌ను విడుద‌ల చేశారు. మిస్టర్ నూకయ్య సినిమాలో ‘పిస్తా పిస్తా.. ’, నేను మీకు తెలుసా సినిమాలో ‘ఎన్నో ఎన్నో..’, మిస్టర్ నూకయ్య సినిమాలో ‘ప్రాణం పోయే బాధ..’ పాట‌లను కూడా మనోజ్ రచించాడు.

Also Read : Raju Weds Rambai Review : ‘రాజు వెడ్స్ రాంబాయి’ మూవీ రివ్యూ.. బాబోయ్ ఇదెక్కడి క్లైమాక్స్ రా బాబు..

ఇలా మనోజ్ కి సంగీతంలో మంచి ప్రావీణ్యమే ఉంది. గతంలో మనోజ్ పలు సినిమాలకు సంగీత విభాగంలో కూడా పనిచేసాడు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ అచ్చు రాజ‌మ‌ణితో క‌లిసి హాలీవుడ్ సినిమా ‘బాస్మ‌తి బ్లూస్’కు మనోజ్ సంగీతాన్ని కూడా అందించారు.

ఈ అనుభవంతోనే మనోజ్ ‘మోహన రాగ మ్యూజిక్’ అనే సంగీత వెంచర్ మొదలుఏపట్టదు. ఇందులో కొత్త ట్యాలెంట్ ని ఎంకరేజ్ చేయడం, ప్ర‌యోగాత్మ‌క సంగీతాన్ని ప్రోత్స‌హించ‌టం, భారతీయ, అంతర్జాతీయ ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా స‌రికొత్త సంగీతాన్ని రూపొందించ‌టమే దీని లక్ష్యం అని తెలిపారు మనోజ్. మనోజ్ కి, మోహన్ బాబుకి ఈ ఇద్దరికీ ఇష్ట‌మైన రాగం మోహ‌న‌ రాగం. అందుకే ఈ పేరుమీదే మనోజ్ తన కొత్త వెంచర్ ని ప్రారంభించారు.

Also Read : 12A Railway Colony Review : ’12A రైల్వే కాలనీ’ మూవీ రివ్యూ.. అల్లరి నరేష్ సస్పన్స్ థ్రిల్లర్ సినిమా ఎలా ఉంది..?