Bunny Vasu : ఐ బొమ్మకు సపోర్ట్.. వాళ్లకు కౌంటర్ ఇచ్చిన బన్నీ వాసు.. ఆ సినిమాలు కూడా పైరసీ అవుతున్నాయిగా..
తాజాగా దీనిపై నిర్మాత బన్నీ వాసు స్పందించారు. (Bunny Vasu)
Bunny Vasu
Bunny Vasu : ఇటీవల సినిమాలు పైరసీ చేసే ఐ బొమ్మ వెబ్ సైట్ నిర్వాహకుడు రవిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఆ సైట్ మూతపడింది. అయితే కొంతమంది మాత్రం సోషల్ మీడియాలో ఐ బొమ్మ రవిని సపోర్ట్ చేస్తూ పోస్టులు, కామెంట్స్ చేస్తున్నారు. అతను చేసేది తప్పు అయినా సినిమా టికెట్ రేట్లు పెరిగాయి అందుకే మేము పైరసీ చూస్తున్నాము అని పలువురు కామెంట్స్ చేస్తూ రవికి సపోర్ట్ చేస్తున్నారు.(Bunny Vasu)
తాజాగా ఓ సినిమా సక్సెస్ ఈవెంట్లో నిర్మాత బన్నీ వాసుని ఐ బొమ్మ రవికి కొంతమంది సపోర్ట్ చేస్తున్నారనే ప్రశ్న వేయగా దీనిపై స్పందించారు.
Also Read : Manchu Manoj : ఇకపై సంగీతంలో కూడా.. మంచు మనోజ్ సరికొత్త ప్రారంభం..
బన్నీ వాసు మాట్లాడుతూ.. ఒక తప్పు వాళ్ళ వేరే వాళ్లకు బెనిఫిట్ జరిగి వాళ్ళు ఆనందంగా ఉన్నారంటే వాళ్ళు అలా చూస్తున్నారు. నా ప్రశ్న ఏంటి అంటే రేట్లు పెంచేశారు అందుకే పైరసీ జరుగుతుంది అని అంటున్నారు. అందుకనే ఆ పైరసీ చూడటం తప్పు కాదు అని ఒక యాటిట్యూడ్ అయితే సోషల్ మీడియాలో వెళ్తుంది. ఎన్ని సినిమాలకు రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఎన్ని సినిమాలకు రేట్లు తక్కువ ఉన్నాయి. ఒక వంద సినిమాలు రిలీజ్ అయితే రేట్లు ఎక్కువ ఉన్న సినిమాలు మహా అయితే ఓ పాతిక సినిమాలు ఉంటాయి. మరి ఆ పాతిక సినిమాలే పైరసీ అవుతున్నాయా. ఆ పాతిక సినిమాలనే ఐ బొమ్మలో చూస్తున్నారా?
చిన్న సినిమా, పెద్ద సినిమా మొత్తం అన్ని సినిమాలు, వంద రూపాయల టికెట్ సినిమా, 150 రూపాయల టికెట్ సినిమా అన్ని సినిమాలు పైరసీ అవుతున్నాయి గా. అన్ని చూసేస్తున్నారు. రేట్లు పెంచడం వల్లే పైరసి చూస్తున్నాం అనే మాట కరెక్ట్ అయితే చిన్న సినిమాల నిర్మాతలు చాలా కష్టపడి సినిమాలు చేస్తారు. అలాంటి నిర్మాతలు వాళ్ళ ఆస్తులను తాకట్టు పెట్టి తీస్తారు. చాలా మంది ఇక్కడ డబ్బులు పోగొట్టుకొని వెళ్తున్నారు. మరి అలాంటోళ్ళ పరిస్థితి ఏంటి? మంచి సినిమాలు కూడా పైరసీ వల్ల లాస్ అయ్యాయి. నిర్మాతలు అంటే డబ్బున్నవాళ్ళు, లాస్ వచ్చినా వాళ్లకేం కాదు అని అంతా అనుకుంటారు. అందరు నిర్మాతలు అలా కాదు. నిర్మాతల కష్టాలు ఎవరూ మాట్లాడారు. మా కష్టాలు బయటకు చెప్పుకోరు. చాలా మంది ఇదేమి తప్పు కాదు అని సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. దీనిని ఎవరూ ఖండించట్లేదు అని అన్నారు.
Also Read : Raju Weds Rambai Review : ‘రాజు వెడ్స్ రాంబాయి’ మూవీ రివ్యూ.. బాబోయ్ ఇదెక్కడి క్లైమాక్స్ రా బాబు..
దీంతో బన్నీ వాసు మాట్లాడింది కూడా కరెక్ట్ కదా కేవలం రేట్లు పెంచిన సినిమాలనే కాదు అన్ని సినిమాలను, చిన్న సినిమాలను కూడా పైరసి చేస్తున్నారు అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
