టాలీవుడ్ స్టార్ హీరో స్టైలీష్ స్టార్ అల్లూ అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘అల..వైకుంఠపురములో..’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బన్నీకి జంటగా పూజాహెగ్డే నటించింది. ఈ సంక్రాంతి బరిలో నిలవనున్న ఈ సినిమా షూటింగ్‌కి లేటెస్ట్‌గా గుమ్మడికాయ కొట్టేసింది చిత్రయూనిట్.
ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. బన్నీ, పూజా డ్యాన్స్ చేస్తున్న ఒక అందమైన పోస్టర్‌ని వదిలింది చిత్ర బృందం. ఈ సినిమా మ్యూజికల్ కన్సర్ట్ ఎప్పుడు జరిగేది ఆదివారం ఉదయం ప్రకటన చేయనున్నట్లు కూడా చిత్ర బృందం అప్ డేట్ ఇచ్చింది. మొత్తానికి రాబోయే రెండు వారాల్లో ఈ రెండు సినిమాల ప్రమోషన్ ఓ రేంజిలో ఉండబోతోందని మాత్రం స్పష్టమవుతోంది.
చిత్ర యూనిట్ తమన్ స్వరాలు అందించిన ఈ సినిమా నుంచి ‘బుట్టబొమ్మా బుట్టబొమ్మా’ లిరికల్ సాంగ్‌ను ఇటీవల విడుదల చేయగా.. ఆ చిత్ర హీరోయిన్ పూజాహెగ్డే ఈ పాట చిత్రీకరణకు సంబంధించిన ఓ వీడియోను ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ‘‘బుట్టబొమ్మా’కు సంబంధించిన ఓ స్పెషల్ వీడియో మీకోసం. ఎవరికీ చెప్పకండి’ ఇది నేను లీక్ చేస్తున్నా అంటూ పూజాహెగ్డే వీడియో పెట్టింది. ఈ వీడియోలో పూజాహెగ్డే-బన్నీ డ్యాన్స్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. సంక్రాంతి పండగను పురస్కరించుకుని జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదలలకు సిద్ధం అవుతుంది.
Here’s a special sneak peak of #buttabomma for you’ll…shhhh…don’t tell anyone ??? #alavaikunthapurramuloo #topsecret @alluarjun #Trivikram @MusicThaman @ArmaanMalik22 @haarikahassine @GeethaArts #PSVinod pic.twitter.com/9y9qpXYluQ
— Pooja Hegde (@hegdepooja) December 29, 2019