Aditya Om : ఆ సమయంలో ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను.. హీరో సంచలన వ్యాఖ్యలు..

నటుడు ఆదిత్య ఓం బిగ్ బాస్ లో సంచలన వ్యాఖ్యలు చేసాడు.

Hero Aditya Om says wants to end his Life at that time Sensational Comments goes Viral

Aditya Om : ఒకప్పుడు హీరోగా లాహిరి లాహిరి లాహిరిలో, ధనలక్ష్మి ఐ లవ్ యు, ప్రేమించుకున్నాం పెళ్ళికి రండి, మా అన్నయ్య బంగారం.. ఇలా అనేక సినిమాలతో మెప్పించిన హీరో ఆదిత్య ఓం ఆ తర్వాత ఫ్లాప్స్ రావడంతో కొన్నాళ్ళు సినీ పరిశ్రమకు దూరమయి ఇటీవలే రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ రీ ఎంట్రీలోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లోకి కూడా వచ్చాడు ఆదిత్య ఓం.

తాజాగా బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ కోసం కొన్ని గిఫ్ట్స్ తెప్పించారు. అవి చూసి కంటెస్టెంట్స్ ఎమోషనల్ అయ్యారు. ఆదిత్య కోసం అతని నాన్న ఫోటో తీసుకొచ్చాడు బిగ్ బాస్.

Also Read : Kirrak Seetha : ఐదేళ్లు రిలేషన్‌లో ఉండి.. వదిలేసి వెళ్ళిపోయాడు.. మిస్ యు అంటూ ఏడ్చేసిన బిగ్ బాస్ సీత..

దీంతో ఆదిత్య ఓం ఎమోషనల్ అయి.. నాలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ అన్ని నేనే నేర్చుకున్నాను. కానీ నాలో ఉన్న మంచి క్వాలిటీస్ కు కారణం మా నాన్నే. కరోనా సమయంలో మా అమ్మ, భార్య, నా కొడుకు అందరికి కరోనా వచ్చింది. ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. ఆ ఆలోచనలే వచ్చేవి. అప్పుడు మా నాన్న ఫోటో కిందపడి అలా చేసుకోవద్దని నన్ను హెచ్చరించాడు అంటూ చెప్తూ ఏడ్చేశాడు.