×
Ad

Kiran Abbavaram: ఇంకా.. ఇంకా ఎదుగుతూనే ఉంటాను.. కె ర్యాంప్ ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం కామెంట్స్..

కె ర్యాంప్.. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి రాబోతున్న మరో రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) హీరోగా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు జైన్స్ నాని తెరకెక్కిస్తున్నాడు.

Hero Kiran Abbavaram interesting comments at the K-Ramp pre-release event

Kiran Abbavaram: కె ర్యాంప్.. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి రాబోతున్న మరో రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు జైన్స్ నాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా(Kiran Abbavaram) గురువారం కె ర్యాంప్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్ లో హీరో కిరణ్ అబ్బవరం “మీ సపోర్ట్ తో ఇంకా ఇంకా ఎదుగుతూనే ఉంటాను” అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

Jaat 2: జాట్ 2 నుంచి దర్శకుడు అవుట్.. కుర్రోడు హ్యాండిల్ చేస్తాడా.. మ్యాజిక్ రిపీట్ అవడం కొంచం..

ఈ ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. “కె ర్యాంప్ సినిమా చాలా బాగా వచ్చింది. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. పండగకి కడుపుబ్బా నవ్వించే సినిమా అవుతుంది. అరె మా అన్న అదిరిపోయే సినిమా చేశాడని ఫీలవుతారు. ఇప్పుడు తక్కువగా మాట్లాడుతున్న. మాకు ఆల్రెడీ తెలుసు సినిమా సక్సెస్ అవుతుంది. సక్సెస్ మీట్ లో చాలా మాట్లాడుతా. ఇక, ఫ్యాన్స్ అనాలా, వెల్ విషర్స్ అనాలా.. మీ ఎప్పుడూ ఉంటూనే ఉంది నాకు. మీ సపోర్ట్ తో ఇంకా ఇంకా ఇంకా ఎదుగుతూనే ఉంటారు. టికెట్ కొనాలా వద్దా అని డౌట్ అవసరం లేదు. మీరు కొనండి మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది. మా టీం ని నమ్మి థియేటర్ కి వెళ్ళండి. కె ర్యాంప్ సినిమా కేవలం ఎంటర్టైన్మెంట్..ఎంటర్టైన్మెంట్.. ఎంటర్టైన్మెంట్ కోసం చేసిన సినిమా” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో కిరణ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక కె ర్యాంప్ సినిమా విషయానికి వస్తే, హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండ నిర్మిస్తున్న ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తోంది. వెన్నెల కిషోర్, నరేష్ కీ రోల్స్ చేస్తున్న ఈ సినిమాకు చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందించాడు. మరి కె ర్యాంప్ సినిమాకి ప్రేక్షకులు ఎలాంటి రిజల్ట్ ఇవ్వనున్నారో చూడాలి.