Jaat 2: జాట్ 2 నుంచి దర్శకుడు అవుట్.. కుర్రోడు హ్యాండిల్ చేస్తాడా.. మ్యాజిక్ రిపీట్ అవడం కొంచం..

జాట్.. బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ హీరోగా వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్(Jaat 2) అయ్యింది. చాలా కాలం తరువాత సన్నీ డియోల్ ను మాస్ అండ్ యాక్షన్ రోల్ లో చేయడంతో ఆయన ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు.

Jaat 2: జాట్ 2 నుంచి దర్శకుడు అవుట్.. కుర్రోడు హ్యాండిల్ చేస్తాడా.. మ్యాజిక్ రిపీట్ అవడం కొంచం..

Director Sriram Aditya to direct Sunny deol Jaat 2 Movie

Updated On : October 17, 2025 / 7:21 AM IST

Jaat 2: జాట్.. బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ హీరోగా వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. చాలా కాలం తరువాత సన్నీ డియోల్ ను మాస్ అండ్ యాక్షన్ రోల్ లో చేయడంతో ఆయన ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని(Jaat 2) తెరకెక్కించిన ఈ మాస్ ఎంటెర్టైనర్ బాలీవుడ్ ఆడియన్స్ ను సూపర్ గా ఆకట్టుకుంది. కథ రొటీన్ అయినప్పటికీ డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేశాడు గోపీచంద్ మలినేని. మరీ ముఖ్యంగా యాక్షన్ సీన్స్ అయితే గూస్బంప్స్ తెప్పించాయి. జాట్ సినిమాకు తెలుగు నేటివిటీ కూడా ఉండటంతో ఈ సినిమాను తెలుగు ఆడియన్స్ కూడా బాగానే ఎంజాయ్ చేశారు.

Rajesh Danda: సింపతీ కార్డుతో పనులు అవ్వవు.. కంటెంట్ ఉండాలి.. నేను కూడా చాలా చేశాను..

ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా జాట్ 2 కూడా ఉంటుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. కానీ, అది ఎప్పుడు ఉంటుంది అనే విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు. అయితే, తాజాగా జాట్ 2 గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే, జాట్ 2 సినిమా త్వరలోనే స్టార్ట్ కాబోతుందట. అయితే, ఈసారి దర్శకుడు మారబోతున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అవును, జాట్ 2 సినిమా కోసం గోపిచంద్ మలినేని కాకుండా శ్రీరామ్ ఆదిత్య వర్క్ చేయబోతున్నాడట. ఈ దర్శకుడు గతంలో భలే మంచి రోజు, శమంతమని, దేవ్ దాస్, మనమే లాంటి సినిమాలు చేశాడు.

శ్రీరామ్ ఆదిత్య ఇప్పటి వరకు మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ఒక్కటి కూడా చేయలేదు. మరి అలాంటి దర్శకుడు జాట్ లాంటి హైవోల్టేజ్ యాక్షన్ డ్రామాను ఎలా హ్యాండిల్ చేయగలడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక జాట్ సినిమా తరువాత దర్శకుడు గోపించంద్ మలినేని నందమూరి బాలకృష్ణతో మరి సినిమా చేయబోతున్నాడు. పీరియాడికల్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాను భారీ ఎత్తున తెరకెక్కించనున్నాడట గోపించంద్ మలినేని. అందుకే, జాట్ సినిమా నుంచి ఆయన తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.