Hero Kiran Abbavaram kept his Promise
అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి లు ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ లవ్ రెడ్డి. గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. నూతన దర్శకుడు స్మరన్ రెడ్డి డైరెక్షన్‌లో ఈ మూవీ తెరకెక్కింది. ఈ మూవీ నేడు (అక్టోబర్ 18న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా.. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు హీరో కిరణ్ అబ్బవరం.
ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించగా ముఖ్య అతిథిగా వచ్చిన కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. ఓ కుటుంబం అంతా కష్టపడి చేసిన సినిమా ఇది. కాబట్టి మీరంతా మీ ఫ్యామిలీలతో కలిసి చూడండి. కంటెంట్ నచ్చితే మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయండి. ఇక నా వల్ల చేతనైనంత సాయం చేస్తాను. ఆంధ్ర, సీడెడ్, నైజాంలో ఒక్కో షో నేను స్పాన్సర్ చేస్తాను అని అన్నారు.
Anee Master : జానీ మాస్టర్ ఇష్యూపై స్పందించిన అనీ మాస్టర్.. జానీ మాస్టర్‌తో 2 ఇయర్స్ కలిసి..
ఇక ఇచ్చిన మాట ప్రకారం.. నైజాం లో జీపీఆర్ ముల్టీప్లెక్స్ లో నేటి సాయంత్రం 7.45 షో, వైజాగ్ – శ్రీ రామా థియేటర్ 6: 30 షో, తిరుపతి – కృష్ణ తేజ 6: 30 షో, విజయవాడ 6:30 షో ప్రేక్షకుల కోసం ఉచితంగా ఏర్పాటు చేసారు. దీంతో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న కిరణ్ అబ్బవరం పై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.