Arthamainda Arun Kumar season 2 teaser : ‘అర్థమయ్యిందా అరుణ్ కుమార్ సీజ‌న్ 2’ టీజ‌ర్ వ‌చ్చేసింది.. ఈ సారి రెట్టింపు న‌వ్వులు..

ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహా తెలుగు ప్రేక్ష‌కుల‌కు మంచి కంటెంట్‌ను అందించ‌డంలో ఎప్పుడూ ముందు ఉంటుంది

Arthamainda Arun Kumar season 2 teaser : ‘అర్థమయ్యిందా అరుణ్ కుమార్ సీజ‌న్ 2’ టీజ‌ర్ వ‌చ్చేసింది.. ఈ సారి రెట్టింపు న‌వ్వులు..

Arthamainda Arun Kumar season 2 teaser out now

Updated On : October 18, 2024 / 10:27 AM IST

Arthamainda Arun Kumar season 2 teaser : ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహా తెలుగు ప్రేక్ష‌కుల‌కు మంచి కంటెంట్‌ను అందించ‌డంలో ఎప్పుడూ ముందు ఉంటుంది. గ‌తేడాది జూన్‌లో వ‌చ్చిన అర్థమ‌య్యిందా అరుణ్ కుమార్ వెబ్ సిరీస్ ప్రేక్ష‌కుల‌ను ఎంతగానో ఆక‌ట్టుకుంటుంది. 100 మిలియన్ ఫ్ల‌స్ స్ట్రీమింగ్ నిమిషాలను సాధించింది.

తాజాగా ఈ వెబ్ సిరీస్‌ రెండో సీజ‌న్ వ‌చ్చేస్తోంది. అక్టోబ‌ర్ 31 నుంచి ఆహాలో రెండో సీజ‌న్ స్ట్రీమింగ్ కానుంది. ఈ నేప‌థ్యంలో రెండో సీజ‌న్‌కు సంబంధించిన టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. కార్పొరేట్ కంపెనీలో ఇంట‌ర్న్‌తో త‌న జ‌ర్నీని ప్రారంభించిన అరుణ్‌కుమార్ రెండో సీజ‌న్‌లో అసిస్టెంట్ మేనేజ‌ర్‌గా మారిన‌ట్లు టీజ‌ర్‌లో చూపించారు.

OG : ప‌వ‌న్ OG షూట్ లొకేష‌న్ చూశారా ?

తొలి సీజ‌న్‌లో కంటే రెండో సీజ‌న్‌లో రెట్టింపు న‌వ్వుకునేలా ఉన్న‌ట్లుగా టీజ‌ర్‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది.

సీజ‌న్‌1లో నటుడు హర్షిత్ రెడ్డి పోషించిన అరుణ్ కుమార్ ముండా పాత్రను సీజ‌న్‌లో సిద్ధూ పవన్ న‌టిస్తున్నారు. ఈ సీజ‌న్‌లో ఇంటర్న్ లుగా సోనియా, సిరి లు సైతం న‌టించారు. తొలి సీజ‌న్‌లో న‌టించిన‌ తేజస్విని మడివాడ షాలిని పాత్రలో, ప‌ల్ల‌వి పాత్ర‌లో అన‌న్య రెండో సీజ‌న్‌లోనూ కొన‌సాగారు. అర్రే స్టూడియో, లాఫింగ్ కౌ ప్రొడక్షన్స్ ద్వారా ఈ వెబ్ సిరీస్ నిర్మిత‌మైంది. డ్రామా, ట్విస్ట్‌లు, వినోదంతో కూడిన సీజ‌న్ 2 అక్టోబ‌ర్ 31 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

Love Reddy : ‘లవ్ రెడ్డి’ మూవీ రివ్యూ.. ఆసక్తికర టైటిల్‌తో ఎమోషనల్ లవ్ స్టోరీ..