Dheera : హీరో లక్ష్ చదలవాడ పుట్టినరోజు కానుకగా.. ధీర ఫస్ట్ లుక్ రిలీజ్

'వలయం' సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ఆయన.. 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి విమర్శకుల ప్రశంసలందుకున్నారు. ఇప్పుడు అదే జోష్ లో మరో ప్రాజెక్టులో భాగమవుతున్నారు. 'ధీర' అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో............

Dheera : హీరో లక్ష్ చదలవాడ పుట్టినరోజు కానుకగా.. ధీర ఫస్ట్ లుక్ రిలీజ్

Hero Laksh chadalavada dheera movie first look released

Updated On : October 10, 2022 / 10:59 AM IST

Dheera :  కెరీర్ ఆరంభం నుంచే వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ మంచి ఫామ్‌లో ఉన్నారు హీరో లక్ష్ చదలవాడ. ‘వలయం’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ఆయన.. ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి విమర్శకుల ప్రశంసలందుకున్నారు. ఇప్పుడు అదే జోష్ లో మరో ప్రాజెక్టులో భాగమవుతున్నారు. ‘ధీర’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో యాక్షన్ మోడ్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులు కోరుకునే ఆసక్తికర సన్నివేశాలతో ఈ సినిమాను గ్రాండ్ గా రూపొందిస్తున్నారు.

ఓ సరికొత్త కథాంశంతో యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ఈ ‘ధీర’ సినిమాను రూపొందిస్తున్నారు. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు చిత్ర ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టిన దర్శకనిర్మాతలు.. ఎప్పటికప్పుడు తమ చిత్రానికి ఆడియన్స్ కనెక్ట్ అయ్యే అప్‌డేట్స్ వదులుతూ సినిమాపై హైప్ పెంచేస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా హీరో లక్ష్ చదలవాడ పుట్టినరోజు కానుకగా ఈ ధీర మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. యాక్షన్ మోడ్ లో హీరోని చూపించి సినిమా రేంజ్ తెలిసేలా చేశారు. నడిరోడ్డు మీద శత్రుమూకలను చిత్తు చిత్తు చేస్తూ పవర్ లుక్ లో కనిపించారు లక్ష్ చదలవాడ. కారు మబ్బుల్లో అర్ధరాత్రి వేళ ఈ ఫైట్ జరుగుతోందని పోస్టర్ స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉందని, 2023లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నాం అని తెలిపారు మేకర్స్.

67th Filmfare South Awards : ఘనంగా 67వ సౌత్‌ ఫిల్మ్ ఫేర్‌ అవార్డు వేడుకలు

పలు సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించిన సాయి కార్తీక్ ఈ సినిమాకు బాణీలు కడుతున్నారు. ధీర సినిమాకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన అన్ని అప్ డేట్స్ సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. దీంతో సినిమా విజయంపై నమ్మకంగా ఉన్నారు దర్శకనిర్మాతలు. ఈ చిత్రంలో లక్ష్ చదలవాడ, నేహా పతన్, సోన్యా భన్సాల్, మిర్చి కిరణ్, హిమజ, నవీన్ నేని, భరణి శంకర్, సామ్రాట్, బాబీ బేడీ, వైవా రాఘవ్, భూషణ్, మేక రామకృష్ణ, సంధ్యారాణి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.