Naga Chaitanya : రేసింగ్‌లోకి అక్కినేని నాగచైతన్య.. ఏ టీమ్‌ను కొనుగోలు చేశారంటే..?
కింగ్ అక్కినేని నాగార్జున వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు అక్కినేని నాగచైతన్య.
- Thota Vamshi Kumar
- Published On : August 22, 2024 / 05:33 PM IST
Hero Naga Chaitanya buys hyderabad blackbird motor racing team
కింగ్ అక్కినేని నాగార్జున వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు అక్కినేని నాగచైతన్య. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నారు. ఇప్పుడికే ఫుడ్ బిజినెస్‌లో అడుగుపెట్టిన చైతు తాజాగా రేసింగ్‌లో అడుగుపెట్టారు.
స్వతహాగా చైతన్యకు ఆటో మొబైల్స్ అంటే ఎంతో ఇష్టం. చిన్నప్పటి నుంచి కారు రేసింగ్స్ అన్నా, ఫార్ములా వన్ అంటే చాలా చాలా ఇష్టం. ఇప్పటికే ఈ విషయాన్ని పలు సందర్భాల్లో ఆయన వెల్లడించారు. తాజాగా తనకిష్టమైన రంగంలోకి చైతన్య అడుగు పెట్టారు. ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ (ఐఆర్ఎఫ్)లో పోటీ పడే హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేశారు. దీంతో ఐఆర్ఎఫ్ ఫార్ములా 4లో భాగమయ్యారు. ఫార్ములా 4 సీజన్‌కు సంబంధించిన రేసులు ఆగస్ట్ 24 నుంచి ప్రారంభం అవుతాయి.
ఈ సందర్బంగా అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ.. తనకు చిన్నప్పటి నుంచి మోటార్ స్పోర్ట్స్ అంటే ఎంతో ఇష్టం అని చెప్పారు. ఇక ఫార్మాలా వన్‌ను ఎంతగానో ప్రేమిస్తానన్నారు. ఫార్ములా వన్‌లోని హైస్పీడ్ డ్రామా, వేగంగా కార్లు, బైక్స్ నడపటంలోని థ్రిల్ నన్నెంతగానో ఆకట్టుకుంటుందన్నారు. ఫార్మాలావన్ పై ఉన్న ఇష్టంతోనే సూపర్ కార్స్, బైక్స్‌ను కొన్నానని చెప్పుకొచ్చారు. ఐఆర్ఎఫ్ అనేది ఈ వెంట్ కాదని, అంతకు మించిన అడ్వెంచర్ అని అన్నారు.
తన ఫ్యాషన్‌ను చూపించుకునే చక్కటి వేదిక ఇదని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్‌ను సొంతం చేసుకోవటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఫ్యాన్స్‌కు ఐఆర్ఎఫ్ అనేది మరచిపోలేని అనుభూతినిస్తుందనటంలో తనకు ఎలాంటి సందేహం లేదన్నారు. అలాగే ఇండియన్ మోటార్ స్పోర్ట్స్ నెక్ట్స్ రేంజ్‌కి చేరుకుంటుందన్నారు.
Imanvi : ప్రభాస్ పక్కన కొత్త అమ్మాయి ఇమాన్వి.. ఎందుకు తీసుకున్నాడో చెప్పిన హను రాఘవపూడి..
ఇక సినిమాల విషయానికి వస్తే.. నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీలో నటిస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
