Indra Re Release : ‘ఇంద్ర’ రీ రిలీజ్.. థియేటర్స్‌లో అంకుల్స్ హంగామా.. రచ్చ చేస్తున్న సీనియర్స్ ఫ్యాన్స్..
చాలా రోజుల తర్వాత మెగాస్టార్ సూపర్ హిట్ సినిమా ఇంద్ర థియేటర్స్ లో రీ రిలీజ్ అవ్వడంతో సీనియర్ ఫ్యాన్స్ అంతా థియేటర్స్ కి వచ్చారు.

Megastar Chiranjeevi Senior Fans Enjoying in Theaters for Indra Movie Re Release
Indra Re Release : నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా చిరు కెరీర్లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇంద్ర సినిమా థియేటర్స్ లో రీ రిలీజ్ చేసారు. సాధారణంగా హీరోల సినిమాలు రీ రిలీజ్ అయితే అభిమానులు థియేటర్స్ లో రచ్చ చేస్తారని తెలిసిందే. ఇంద్ర సినిమాకు కూడా మెగా అభిమానులు అంతే రచ్చ చేస్తున్నారు. కానీ ఈ సరి స్పెషల్ ఏంటంటే సీనియర్ ఫ్యాన్స్ అంతా రంగంలోకి దిగారు.
చిరంజీవి 80, 90, 2000 దశకాల్లో స్టార్ హీరో అని తెలిసిందే. ఇప్పుడున్న స్టార్ హీరోలు కూడా పుట్టకముందే మెగాస్టార్ స్టార్ డమ్ చూసేసారు. అప్పట్లో కుర్రాళ్ళు మెగాస్టార్ సినిమా టికెట్ల కోసం క్యూలైన్ స్ లో కొట్టుకున్నారు. థియేటర్స్ దగ్గర రచ్చ చేసారు. కానీ ఇప్పుడు వాళ్లంతా పెద్ద వాళ్ళయిపోయారు. చిరంజీవికి ఈ జనరేషన్ కన్నా ముందు జనరేషన్స్ లోనే అభిమానులు ఎక్కువ అని తెలిసిందే.
Also Read : Chiranjeevi : చిరు కాళ్ళ మీద పడి ఆశీర్వాదం.. ఈ పిల్లోడు ఎవరో తెలుసా? మెగాస్టార్ బర్త్ డేకి షేర్ చేసిన హీరో..
అందుకే చాలా రోజుల తర్వాత మెగాస్టార్ సూపర్ హిట్ సినిమా ఇంద్ర థియేటర్స్ లో రీ రిలీజ్ అవ్వడంతో సీనియర్ ఫ్యాన్స్ అంతా థియేటర్స్ కి వచ్చారు. ఇప్పుడు అంతా అంకుల్స్ అయిపోయినా మెగాస్టార్ ని తెరపై చూడగానే వాళ్ళల్లో ఊపు వచ్చింది. ఆ ఊపుతో థియేటర్స్ లో ఇంద్ర పాటలకు డ్యాన్సులు వేస్తూ రచ్చ చేస్తున్నారు. అది కూడా ఎర్లీ మార్నింగ్ షోలకు వచ్చి హంగామా చేస్తుండటంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. దీంతో అంకుల్స్ థియేటర్స్ లో డ్యాన్సులు వేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Ah Grace Choodu Thammudu❤️??
Senior Fans assalu thaggatledhu??#Indra4K #Indra4KRerelease #IndraOnAug22 #MegaStarChiranjeevi #HBDChiranjeevi @KChiruTweets pic.twitter.com/F8u5zO7ac6— Dinesh Yash (@DineshYash8) August 22, 2024
అసలు అభిమానం, మా హీరో అని థియేటర్స్ లో రచ్చ చేసే ఇప్పటి ఫ్యాన్స్ వీళ్ళని చూసి అభిమానం అంటే ఇది, థియేటర్స్ లో గోల అంటే ఇది అని ఆశ్చర్యపోతూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి చిరంజీవి ఇంద్ర రీ రిలీజ్ చాలా మంది సీనియర్ ఫ్యాన్స్ కి ఒక కొత్త ఉత్సాహాన్ని, ఇప్పటి జనరేషన్ కి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మీరు కూడా థియేటర్స్ లో అంకుల్స్ డ్యాన్సులు వేస్తున్న వీడియోలు చూసేయండి.
I request to give permanent tagline of "Musalode kaani mahanubhavudu"….Adi athani sotthu??
Boss ni match chesaru ayya?? Lucky enough to sit beside him and watch complete film #Indra4K #HBDMegastarChiranjeevi @KChiruTweets Bossuuu…Mee die heart fan anta?❤️ pic.twitter.com/m8iCOIkVmz— Mr.Mahi✌️ (@MrMahi79) August 22, 2024
Edhi bosuu nee range @KChiruTweets
Ee age lo early mrng show ki ???????
Uncles Motham Shake shake chesaru theatre Motham ???#Indra4kBookings #Indra4KRerelease pic.twitter.com/sauUv4500y
— జయంత్? (@https_jayanth) August 22, 2024
Age tho samandam lekunda racha chesthunaru kadha raa???#Indra4KRereleaseOnAug22 #Indra4KRereleas #HappyBirthdayChiranjeevi pic.twitter.com/Ut8DkHI5z8
— జయంత్? (@https_jayanth) August 22, 2024