Chiranjeevi : చిరు కాళ్ళ మీద పడి ఆశీర్వాదం.. ఈ పిల్లోడు ఎవరో తెలుసా? మెగాస్టార్ బర్త్ డేకి షేర్ చేసిన హీరో..
ఓ హీరో తన చిన్నప్పుడు చిరంజీవి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటున్న ఫోటో షేర్ చేసాడు.

A Tollywood Hero Shares his Childhood Photo with Megastar Chiranjeevi
Chiranjeevi : నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కావడంతో అభిమానులతో పాటు అనేకమంది సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కొంతమంది ఆయనతో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేస్తున్నారు. ఇక చిన్నప్పట్నుంచి ఆయనతో అనుబంధం ఉన్నవాళ్లు పాత ఫోటోలు షేర్ చేసి మరీ ఆయనకు విషెస్ చెప్తున్నారు.
ఈ క్రమంలో ఓ హీరో తన చిన్నప్పుడు చిరంజీవి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటున్న ఫోటో షేర్ చేసాడు. ఇంతకీ ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా? మెగా ఫ్యామిలీకి చెందిన వాడే. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ చిన్నప్పుడు తన పెదనాన్న కాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్న ఫోటోని, అట్లాగే తన పెళ్లిలో చిరంజీవిని కౌగిలించుకున్న ఫోటోని షేర్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. చిన్నప్పటి ఫొటోలో చిరంజీవి తండ్రి కూడా ఉన్నారు.
ఈ ఫోటోలు షేర్ చేసి.. మాకు ప్రతి సమస్యని నవ్వుతో ఎదుర్కోవడం నేర్పించినందుకు, ప్రేమ, అనుభంధాలతో మమ్మల్ని పెంచినందుకు ధన్యవాదాలు. నువ్వే మాకు అతి పెద్ద ఇన్స్పిరేషన్. నువ్వు మాతో ఉన్నందుకు థ్యాంక్యూ. హ్యాపీ బర్త్ డే డాడీ అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేసాడు వరుణ్ తేజ్. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.