Imanvi : ప్రభాస్ పక్కన కొత్త అమ్మాయి ఇమాన్వి.. ఎందుకు తీసుకున్నాడో చెప్పిన హను రాఘవపూడి..
సలార్, కల్కి 2898 AD చిత్ర విజయాలతో మంచి జోష్‌లో ఉన్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.

why Hanu Raghavapudi chose Imanvi to star opposite Prabhas in his next film
Imanvi Esmail : ‘సలార్’, ‘కల్కి 2898 AD’ చిత్ర విజయాలతో మంచి జోష్‌లో ఉన్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇదే ఉత్సాహంలో ఆయన వరుస సినిమాల్లో నటించేందుకు సిద్ధం అయ్యారు. ఇందులో హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీ ఒకటి. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి ‘ఫౌజీ’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ చిత్రం నిర్మితం కానుంది. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన సోషల్ మీడియా స్టార్ ఇమాన్వీ ఎస్మాయిల్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
స్టార్స్ హీరోయిన్లను కాదుకుని మరీ ఒక్క మూవీలో నటించని ఇమాన్వీకి రెబల్ స్టార్ ప్రభాస్ పక్కన నటించే అవకాశం ఎలా వచ్చిందని అందరూ అనుకుంటున్నారు. దీనిపై దర్శకుడు హను రాఘవపూడి స్పందించారు. ప్రస్తుతం కొత్త టాలెంట్‌ను వెలికితీయడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోందన్నారు. దీని వల్ల చిత్ర బృందానికి తమ కథకు అనుగుణంగా నటీనటులను ఎంపిక చేసుకోవడం సులభం అవుతుందన్నారు. ఇమ్మాన్వీ అందం, ప్రతిభ కలిగిన అమ్మాయని, తాను కూడా ఆమె డ్యాన్స్ వీడియోలు చూస్తుంటానని చెప్పుకొచ్చారు.
ఇమాన్వీ మంచి క్లాసికల్ డ్యాన్సర్ అని, కళ్లతోనే ఎన్నో హావభావాలను పలికిస్తుంటుందని చెప్పారు. దీంతో ఆమెకు అవకాశం ఇవ్వాలని భావించినట్లుగా తెలిపారు. ఆడిషన్స్, స్క్రీన్ టెస్ట్ తరువాతనే ఆమెను ఎంపిక చేశామని, ఇది తన ఒక్కడి నిర్ణయం మాత్రమే కాదని, చిత్ర బృందం మొత్తం నిర్ణయం అని అన్నారు.
ఇమాన్వీ ఎస్మాయిల్ విషయానికి వస్తే.. ఇన్‌స్టాగ్రామ్ స్టార్‌గా ఆమె నెటిజన్లకు చాలా బాగా తెలుసు. తెలుగు, తమిళ, హిందీ పాటలకు ఆమె డ్యాన్స్ చేస్తుంటుంది. ఇన్‌స్టాలో ఆమెకు లక్షల్లో ఫాలోవర్లు ఉన్నారు.