Hero Nithiin misses Kiran Sabbavaram K Ramp movie
K-Ramp: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కె ర్యాంప్. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దీపావళి కానుకగా పండుగ సీజన్ లో నాల్గవ సినిమాగా విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. తెరపై కుమార్ పాత్రలో కిరణ్ అబ్బవరం చేసిన మాస్ జాతరకు కదుపుచెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. దీంతో ఈ సినిమా దీపావళి సీజన్ విన్నర్ గా నిలిచింది. (K-Ramp)కలక్షన్స్ కూడా అదే రేంజ్ లో రాబట్టింది ఈ సినిమా. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు కె ర్యాంప్ సినిమా మొదటిరోజు ఏకంగా రూ.4.5 కోట్ల గ్రాస్ రాబట్టినట్టు సమాచారం.
Samantha: సమంత బోల్డ్ కామెంట్స్.. డైరెక్టర్స్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు.. నన్ను అలా చూసుకోలేదు..
పోటీ లేకుంటే ఈ లెక్క ఇంకా ఎక్కువగా ఉండేదని అంచనా వేస్తున్నారు. అయినప్పటికి ఈ రేంజ్ లో కలక్షన్స్ రాబట్టడం అంటే మామూలు విషయం కాదు అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక వీకెండ్ కావడం వల్ల ఈ సినిమా కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి, కె ర్యాంప్ సినిమా కిరణ్ అబ్బవరం కెరీర్ లో హైయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచే అవకాశం క్లియర్ గా కనిపిస్తోంది.ఇదిలా ఉంటే, తాజాగా కె ర్యాంప్ సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే, కె ర్యాంప్ సినిమాను దర్శకుడు జైన్స్ నాని తెరకెక్కించాడు.
కానీ, ముందుగా ఈ సినిమా కోసం యూత్ స్టార్ నితిన్ అని అనుకున్నాడట. కథ కూడా ఆయనకు వినిపించగా బాగా నచ్చిందట. ఒకే కూడా చెప్పేశాడట. కానీ, కే ర్యాంప్ సినిమాకు ఎలాంటి బ్యాగేజ్ లేని హీరో కావాలి. కాబట్టి, నాపై ఇలాంటి కథ వర్కౌట్ కాదు అని చెప్పాడట నితిన్. అలా తనకు తానుగా కె ర్యాంప్ సినిమా నుంచి బయటకు వచ్చాడట నితిన్. ఈ న్యూస్ తెలిసి నితిన్ ఫ్యాన్స్ చాల డిజప్పాయింట్ అవుతున్నారట. కారణం ఏంటంటే, చాలా కాలంగా నితిన్ కు సరైన హిట్ లేదు. కనీసం ఈ సినిమాతో అయినా కంబ్యాక్ ఇచ్చేవాడివి కదన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఎలాగైతేనేం.. నితిన్ తన కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ చేసుకున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.