Samantha: సమంత బోల్డ్ కామెంట్స్.. డైరెక్టర్స్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు.. నన్ను అలా చూసుకోలేదు..

సౌత్ బ్యూటీ సమంత ఇప్పుడు నార్త్ బ్యూటీగా మారిపోయింది. ఇక్కడ సినిమాలు (Samantha)తగ్గించిన ఆమె బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోంది. ఇటీవలే మాయోసైటిక్ వ్యాధి నుంచి బయటపడ్డ ఈ బ్యూటీ హాలీవుడ్ రీమేక్ సిటాడెల్: హానీ బన్నీ సిరీస్ లో నటించింది.

Samantha: సమంత బోల్డ్ కామెంట్స్.. డైరెక్టర్స్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు.. నన్ను అలా చూసుకోలేదు..

Samantha says director didn't give her bold roles

Updated On : October 19, 2025 / 11:45 AM IST

Samantha: సౌత్ బ్యూటీ సమంత ఇప్పుడు నార్త్ బ్యూటీగా మారిపోయింది. ఇక్కడ సినిమాలు తగ్గించిన ఆమె బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోంది. ఇటీవలే మాయోసైటిక్ వ్యాధి నుంచి బయటపడ్డ ఈ బ్యూటీ హాలీవుడ్ రీమేక్ సిటాడెల్: హానీ బన్నీ సిరీస్ లో నటించింది. స్టార్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ఈ సిరీస్ లో యాక్షన్ మోడ్ లో కనిపించిన సమంత అదరగొట్టేసింది. సిరీస్ కూడా మంచి విజయాన్ని సాధించింది(Samantha). ఇక ఈ సిరీస్ తరువాత చాలా గ్యాప్ తరువాత తెలుగులో ఆమె ప్రొడ్యూస్ చేసిన శుభం అనే సినిమాలో కనిపించింది సమంత. చిన్న పాత్రలో అయినా తన మార్క్ చూపించింది సమంత. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది.

SSMB 29: మహేష్-రాజమౌళి మూవీ క్రేజీ అప్డేట్.. టైటిల్ గ్లింప్స్ డేట్ ఇదే.. హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్

అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత తన ప్రీవియస్ సినిమాల గురించి పని చేసిన దర్శకుల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాను బోల్డ్ సీన్స్ లో నటించకపోవడానికి కూడా కారణం చెప్పింది. ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. “సినిమాల్లో నేను చేసిన పాత్రలన్నీ మంచివే. నేను సెక్సీగా ఉంటానని నాకే ఎప్పుడూ అనిపించలేదు. ఇక నేను పని చేసిన డైరెక్టర్స్ కూడా నాకు బోల్డ్ క్యారెక్టర్స్ ఇవ్వలేదు. నాకు ఒకే పాలసీ. చేసిన పాత్ర ఏదైనా వందశాతం ఇవ్వడానికి కష్టపడతాను. నాకు తెలిసింది డెడికేషన్ తో వర్క్ చేయడం మాత్రమే”అంటూ చెప్పుకొచ్చింది. దీంతో సమంత చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే, సమంత తెలుగులో మా ఇంటి బంగారం అనే సినిమా చేస్తోంది. ఈ సినిమాను సమంత స్వయంగా నిర్మిస్తోంది. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలుకానుంది. ఇక బాలీవుడ్ లో సమంత రక్త్ బ్రహ్మాండ్ అనే సినిమా చేస్తోంది. యాక్షన్ బ్యాక్డ్రాప్ లో రానున్న ఈ సినిమాను దర్శద్వయం రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.