Prabhas : విలన్‌ రోల్‌లో డార్లింగ్‌ ప్రభాస్‌..?

బాహుబలిగా నటించి సెఫరేట్‌ ఆడియన్స్‌ను సంపాదించుకున్న ప్రభాస్ విలన్‌గా కూడా అదే రేంజ్‌లో మెప్పించాలనుకుంటున్నాడట.

Hero Prabhas To do Full length Villain Role

ప్రభాస్..ఇండస్ట్రీలో డార్లింగ్‌గా అందరి మనసులు గెలుచుకున్న రెబల్ స్టార్. వరుస సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నాడు. లేటెస్ట్‌గా కన్నప్ప మూవీలో ప్రభాస్‌ యాక్టింగ్ మరోసారి ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది. ఎప్పుడూ స్మార్ట్‌గా హీరో లుక్‌లో కనిపించే డార్లింగ్‌ ఓ సారి మాస్ లుక్, ఆ కరిష్మాతో యాంటీ-హీరోగా తెరపై సందడి చేస్తే సమ్‌థింగ్‌గా డిఫరెంట్‌గా ఉండటం ఖాయం.

బాహుబలిగా నటించి సెఫరేట్‌ ఆడియన్స్‌ను సంపాదించుకున్న ప్రభాస్ విలన్‌గా కూడా అదే రేంజ్‌లో మెప్పించాలనుకుంటున్నాడట. ఇప్పటికే సలార్‌లో చూపించిన గ్రే షేడ్ క్యారెక్టర్‌తో రచ్చ చేసిన ప్రభాస్, ఇప్పుడు మరో స్టెప్ ముందుకేసి ఫుల్-ఫ్లెడ్జ్ యాంటీ-హీరోగా రెచ్చిపోవడానికి సిద్ధమవుతున్నాడనే గుసగుసలు ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి.

The 100 : ‘ది 100’ మూవీ రివ్యూ.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే సాగర్ సినిమా ఎలా ఉంది?

ప్రభాస్ ఓ బాలీవుడ్ డైరెక్టర్‌తో కొత్త ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ డైరెక్టర్ ఎవరన్నది ఇంకా రివీల్ కానప్పటికీ, సినిమా కథ ప్రభాస్‌కి బాగా నచ్చిందని, అందుకే ఒక్కటే ఒక్క మీటింగ్‌లోనే ఓకే చెప్పేశాడని టాక్. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర పూర్తిగా మాస్ యాంటీ-హీరో రోల్ అని, ఇప్పటివరకూ ఆయన చేయని రోల్‌గా చెబుతున్నారు.

ఈ ప్రాజెక్ట్‌ను ఓ ప్రముఖ బాలీవుడ్ బ్యానర్ నిర్మించనుందని, భారీ బడ్జెట్‌తో పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కనుందని సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్ లుక్, యాక్షన్ సీక్వెన్సెస్ అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పిస్తాయని అంచనాలున్నాయి. బాలీవుడ్ డైరెక్టర్ డార్లింగ్‌ స్టార్‌డమ్‌ను వాడుకుని ఓ రేంజ్‌లో సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నాడట. మరి ఈ యాంటీ-హీరో రోల్‌తో ప్రభాస్ ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో చూడాలి. ప్రస్తుతం రాజాసాబ్, హను రాఘవపూడి ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న ప్రభాస్, ఈ బాలీవుడ్ సినిమాకు డేట్స్ ఎలా కేటాయిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.