The 100 : ‘ది 100’ మూవీ రివ్యూ.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే సాగర్ సినిమా ఎలా ఉంది?

ఆర్కే సాగర్ మొగలిరేకులు సీరియల్ తో, అందులోని పోలీస్ పాత్రతో స్టార్ డమ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

The 100 : ‘ది 100’ మూవీ రివ్యూ.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే సాగర్ సినిమా ఎలా ఉంది?

The 100

Updated On : July 19, 2025 / 8:11 PM IST

The 100 Movie Review : మొగలిరేకులు ఫేమ్ ఆర్కే సాగర్ ‘ది 100’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రియ ఫిలిం కార్పొరేషన్, దమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమేష్ కరుటూరి, వెంకీ, తారక్ రామ్ నిర్మాణంలో రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మిష నారంగ్, ధన్య బాలకృష్ణ, ఆనంద్, కళ్యాణి నటరాజన్, విష్ణుప్రియ, తారక్ పొన్నప్ప, గిరిధర్.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. ది 100 సినిమా నేడు జులై 11న థియేటర్స్ లో రిలీజయింది. ముందురోజే ప్రీమియర్లు కూడా వేశారు.

కథ విషయానికొస్తే.. మధుప్రియ(విష్ణుప్రియ) తన బాయ్ ఫ్రెండ్ తో వీడియో కాల్ లో ఉండగానే సూసైడ్ చేసుకొని చనిపోవడంతో కథ మొదలవుతుంది. ఊరి చివర ఉన్న ఇళ్లల్లో దొంగతనాలు జరుగుతూ ఉంటాయి, అడ్డమొస్తే మనుషులను చంపేసి కేవలం బంగారం మాత్రమే దొంగలిస్తూ ఉంటారు ఒక ముఠా. విక్రాంత్ ఐపీఎస్(ఆర్కే సాగర్) ట్రైనింగ్ లో ఉన్నప్పుడు ఈ కేసు గురించి తెలుసుకుంటాడు. ACP గా ఛార్జ్ తీసుకున్నాక ఈ కేస్ మీద ఫోకస్ పెట్టి దొంగల్ని పట్టుకోలేకపోయినా పోయిన బంగారాన్ని పట్టుకొని కంప్లైంట్ ఇచ్చినవాళ్లకి ఎవరి బంగారం వాళ్లకు ఇచ్చేస్తాడు. అందులో ఒక హారం తను ఇష్టపడుతున్న అమ్మాయి ఆర్తి(మిష నారంగ్)ది అని తెలిసి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వకపోవడంతో వాళ్ళింటికి వెళ్తే వాళ్ళు ఆ హారం తమది కాదంటారు.

కానీ తర్వాత ఆర్తి తండ్రి విక్రాంత్ ని కలిసి ఒక రోజు దొంగలు పడి దోచుకొనిపోయి ఆర్తిని రేప్ చేసారు, తర్వాత తన భార్య కూడా చనిపోయింది అని చెప్తాడు. దీంతో విక్రాంత్ కేసుని పర్సనల్ గా తీసుకొని దొంగల్ని పట్టుకుంటాడు. కానీ ఆ రేప్ చేసింది వాళ్ళు కాదు అని తెలుస్తుంది. అంతలోనే కొంతమంది మైనర్లు ఆ రేప్ మేమే చేసాం అని లొంగిపోతారు. అసలు ఆర్తి వాళ్ళింట్లో దొంగతనం చేసింది ఎవరు? ఆర్తిని రేప్ చేసింది ఎవరు?దొంగతనాలు ఎందుకు చేస్తున్నారు? మధుప్రియ సూసైడ్ ఎందుకు చేసుకుంది? మధుప్రియకు – ఆర్తికి సంబంధం ఏంటి? మైనర్లను ఎవరు లొంగిపొమ్మన్నారు? విక్రాంత్ ఈ కేసుని ఎలా డీల్ చేసాడు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Baahubali The Epic: బాహుబలి ఫ్యాన్స్‌కు పండగే.. పదేళ్ల తర్వాత రాజమౌళి మరో సంచలనం.. రెండు భాగాలు కలిపి ఒకే సినిమాగా రీరిలీజ్..

సినిమా విశ్లేషణ.. ఆర్కే సాగర్ మొగలిరేకులు సీరియల్ తో, అందులోని పోలీస్ పాత్రతో స్టార్ డమ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. చానళ్ల తర్వాత మళ్ళీ పోలీస్ పాత్రలో వస్తుండటం, పవన్ కళ్యాణ్, మినిస్టర్లు, పవన్ తల్లి.. ఇలా చాలామందితో ప్రమోషన్స్ చేయించడం, ట్రైలర్ మాత్రం కథ ఏంటి అనేది అర్దమవకుండా బాగా కట్ చేయడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.

మొదటి అరగంట హీరో పాత్ర పరిచయం, అతను పోలీస్ ఆఫీసర్ అయ్యేవరకు సింపుల్ గా సాగుతూనే మధుప్రియ చనిపోవడంతో అసలు ఏం జరిగింది అనే క్యూరియాసిటీ నెలకొంటుంది. దొంగతనాల కేసు డీలింగ్ చేస్తుండటంతో కార్తీ ఖాకి సినిమా రేంజ్ లో ఉంటుందేమో అనిపిస్తుంది కానీ అది చాలా సింపుల్ గా తేల్చేసి రేప్ కేసుకి మార్చేయడంతో రొటీన్ కథ అనిపిస్తుంది. ఇంటర్వెల్ కి ట్విస్ట్ ఇచ్చారు అనుకున్నా అది ట్విస్ట్ కాదని ఈజీగానే అర్థమైపోతుంది. ఇక సెకండ్ హాఫ్ కాస్త సాగదీశారు.

సీరియస్ ఎమోషనల్ సన్నివేశంలో పాట పెట్టడం, మధుప్రియ -ఆర్తి కనెక్షన్ బాగానే రాసుకున్నా ఆ స్టోరీ పది నిమిషాల్లో చెప్పేదానికి ఇంకా ఎక్కువే సాగదీయడంతో బోర్ కొడుతుంది. రేప్ కేస్ కాస్త ఎటెటో వెళ్ళిపోతుంది. అది కొత్త పాయింట్ గా చెప్పడానికి ట్రై చేసినా రొటీన్ కథనంతో సాగదీస్తూ చెప్పారు. చివర్లో క్లైమాక్స్ సింపుల్ గా హడావిడిగా ముగించేశారు. టైటిల్ ది 100 కి ఐపీసీ సెక్షన్ 100 ని లింక్ చేస్తూ చెప్పడం గమనార్హం.

The 100

నటీనటుల పర్ఫార్మెన్స్.. ఆర్కే సాగర్ పోలీస్ పాత్రలో పర్ఫెక్ట్ గా సరిపోయినా మొగలిరేకులు లో అతన్ని పోలీస్ గా చూసి చూసి ఈ సినిమాలో పోలీస్ పాత్ర వల్ల ఇంకా సీరియల్ యాక్టింగ్ నుంచి బయటకు రాలేదు అని కొన్ని సీన్స్ లో అనిపిస్తుంది. ధన్య బాలకృష్ణ హీరో ఫ్రెండ్ పాత్రలో బాగానే నటించింది. మిష నారంగ్ ఎమోషనల్ పాత్రలో బాగా మెప్పించింది. హీరో తల్లి పాత్రలో, సైకాలజిస్ట్ గా కళ్యాణి నటరాజన్ బాగా నటించారు.

గిరిధర్ ఇన్ స్పెక్టర్ పాత్రలో, ఆర్కే సాగర్ కి సపోర్ట్ ఉండే పాత్రలో బాగానే మెప్పించాడు. యాంకర్ విష్ణుప్రియకు చాన్నాళ్లకు మంచి పాత్రే పడింది. తారక్ పొన్నప్ప స్టైలిష్ విలన్ గా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. ఆనంద్, జయంత్, వంశీ నెక్కంటి, టెంపర్ వంశీ.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపిస్తారు.

Also Read : RK Sagar : పవన్ కళ్యాణ్ OG సినిమాలో ఛాన్స్ మిస్.. అది మిస్ అయినా ఆయనతో కలిసి..

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బానే ఉన్నా కొన్ని షాట్స్ సీరియల్ షాట్స్ లా అనిపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. పాటలు బాగానే ఉన్నాయి. ఎడిటింగ్ పరంగా సెకండ్ హాఫ్ కొన్ని సీన్స్ ట్రిమ్ చేస్తే బాగుండేది. కొత్త పాయింట్ ని తీసుకొని రొటీన్ కథనంతో తెరకెక్కించాడు డైరెక్టర్. నిర్మాణ పరంగా సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు కనిపిస్తుంది.

మొత్తంగా ‘ది 100’ సినిమా పోలీసాఫీసర్ ఓ కేసుని టేకప్ చేయగా అది మలుపులు తిరగడం, దాన్ని ఎలా డీల్ చేసాడు అని సస్పెన్స్ థ్రిల్లర్ లా తెరకెక్కించారు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమాకు రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.