×
Ad

Hero Raj Tarun : రాజ్ తరుణ్-లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్.. మాల్వితో రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు!

Hero Raj Tarun : రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వి మల్హోత్రాను లావణ్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ముంబైలోని ఓ ఇంట్లో మాళవితో కలిసి ఉండగా లావణ్యకు ఇద్దరూ అడ్డంగా దొరికిపోయారు.

  • Published On : September 6, 2024 / 11:04 PM IST

Hero Raj Tarun Caught in Heroine Malvi Malhotra House

Hero Raj Tarun : టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వి మల్హోత్రాను లావణ్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ముంబైలోని ఓ ఇంట్లో మాళవితో కలిసి ఉండగా లావణ్యకు ఇద్దరూ అడ్డంగా దొరికిపోయారు.

ఈ క్రమంలో వారిద్దరిని లావణ్య నిలదీయగా ఆమెపై మాల్వి మల్హోత్రా దూషణకు దిగినట్టు తెలుస్తోంది. తనను మోసం చేసి మాల్వీతో రాజ్ తరుణ్ సహజీవనం చేస్తున్నాడంటూ లావణ్య ఆరోపణలు చేసింది.

ముంబైలో రహస్యంగా ఉంటున్నారని సమాచారంతో అక్కడికి వెళ్లి ఇద్దర్నీ లావణ్య నేరుగా పట్టుకుంది. నా రాజ్‌ను నాకు అప్పగించాలంటూ మాల్వితో ఆమె గొడవకు దిగినట్టు తెలిసింది.

ఇప్పటికే రాజ్ తరుణ్ లావణ్య కేసులో నార్సింగి పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఛార్జ్ షీట్‌లో రాజ్ తరుణ్‌ను నిందితుడిగా చేర్చారు.

ఇప్పటికే, లావణ్యతో కలిసి ఉన్నట్టుగా ఆమె ఇంటి వద్ద సాక్ష్యాలను పోలీసులు సేకరించినట్టు తెలిపారు. రాజ్తరుణ్ లావణ్యతో సహజీవనం చేసినట్లుగా పోలీసులు పేర్కొన్నారు.

Read Also : మోక్షజ్ఞ సినిమాలో ఎన్టీఆర్ రోల్ అదేనా? మూవీలో బాలకృష్ణ కూడా?