Hero Ram Pothineni emotional comments at Andhra King Taluka Success Meet
Ram Pothineni: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా. దర్శకుడు మహేష్ బాబు పీ తెరకెక్కించిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సీ హీరోయిన్ గా నటించింది. ఆ ఫ్యాన్ బయోపిక్ అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర ఆంధ్ర కింగ్ లా కనిపించాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాపై ముందునుంచి ఆడియన్స్ లో మంచి హైప్ క్రియేట్ అయ్యింది. నవంబర్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆలాగే ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా అక్కడక్కడా స్లో సాగింది అనే కామెంట్స్ వినిపించినప్పటికే చూసినవాళ్లు మాత్రం బాగానే ఉంది అని చెప్పారు. కానీ, కలెక్షన్స్ మాత్రం అంతగా రాబట్టలేకేపోతోంది ఈ మూవీ.
మంచి అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా మొదటిరోజు రూ.4 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. పాజిటీవ్ టాక్ వచ్చింది కాబట్టి రానున్న రోజుల్లో మంచి కలెక్షన్స్ వస్తాయని అనుకున్నారు మేకర్స్. కానీ, ఏమయిందో తెలియదు కలెక్షన్స్ డ్రాప్ అవుతూ వచ్చాయి. మొత్తంగా ఐదు రోజుల్లో ఈ సినిమా కేవలం రూ.17 కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. దీంతో, మంచి పాజిటీవ్ టాక్ వచ్చిన సినిమా కూడా ఆడియన్స్ థియేటర్స్ కి రాకపోవడంతో ప్లాప్ గా నిలవాల్సి వచ్చింది. ఇక తాజాగా ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా సక్సెస్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్.
ఈ ఈవెంట్ లో హీరో రామ్(Ram Pothineni) మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ఆంధ్ర కింగ్ తాలూకా నా కెరీర్ లో చాలా స్పెషల్ సినిమా. ఈ కథను ఆడియన్స్ కు తప్పకుండా చెప్పాలనే ఉద్దేశంతో చేశాను. నా గత సినిమాలకు ప్లాప్ అయితే పక్కకు తప్పుకొని వెళ్ళిపోయాను. ప్లాప్ సినిమాని హిట్ అని మీపై రుద్దటానికి ఎప్పుడు ట్రై చేయలేదు. అలా చేయను కూడా. కానీ, ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాకు ఆడియన్స్ నుంచి పాజిటీవ్ టాక్ వచ్చింది. పది మంది చూస్తే అందులో తొమ్మిది మంది సినిమా బాగుంది అన్నారు. కానీ, సినిమాను ఆ పది మంది మాత్రమే చూస్తారు. అది బాధగా ఉంది. మంచి సినిమా మీకు అందించాలని మా ప్రయత్నం చేశాము. మీకు తప్పకుండా నచ్చుతుంది. థియేటర్స్ కి వెళ్లి సినిమా చూడండి”అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు రామ్. మరి రామ్ చేసిన ఈ కామెంట్స్ తో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు వెళ్తారా అనేది చూడాలి.