Tere Ishq Mein: తమిళోడి దెబ్బకి బాలీవుడ్ బాక్సాఫిస్ షేక్.. రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న తేరే ఇష్క్ మే.. 5 రోజుల్లో భారీ కలెక్షన్స్..

తమిళ స్టార్ హీరో ధనుష్ హిందీలో చేసిన లేటెస్ట్ మూవీ 'తేరే ఇష్క్ మే(Tere Ishq Mein)'. దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ తెరకెక్కించిన ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా నటించింది.

Tere Ishq Mein: తమిళోడి దెబ్బకి బాలీవుడ్ బాక్సాఫిస్ షేక్.. రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న తేరే ఇష్క్ మే.. 5 రోజుల్లో భారీ కలెక్షన్స్..

Dhanush Tere Ishq Mein movie collecting high numbers at bollywood box office

Updated On : December 3, 2025 / 2:47 PM IST

Tere Ishq Mein; తమిళ స్టార్ హీరో ధనుష్ హిందీలో చేసిన లేటెస్ట్ మూవీ ‘తేరే ఇష్క్ మే(Tere Ishq Mein)’. దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ తెరకెక్కించిన ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా నటించింది. ఇంటెన్స్ లవ్ అండ్ ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ ఫిదా ఐపోతున్నారు. విడుదలకు ముందే టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో ఒక రేంజ్ లో హైప్ క్రియేట్ చేసింది ఈ సినిమా. అలాగే, హీరో ధనుష్ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ కాంబోలో గతంలో రంజనా అనే సినిమా వచ్చి భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు మళ్ళీ అదే కాంబోలో ఇంటెన్స్ లవ్ స్టోరీతో ఒక సినిమా రావడంతో సహజంగానే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Akhanda 2: అఖండ 2 ముందు భారీ టార్గెట్.. బ్రేకీవెన్ ఎంతో తెలుసా.. అంత కలెక్షన్స్ సాధ్యమేనా..

ఆ అంచనాలను ఏమాత్రం తక్కువ చేయకుండా అదిరిపోయింది సినిమా. మొదటి ఆట నుంచి యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా. దీంతో బాక్సాఫిస్ దగ్గర కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది తేరే ఇష్క్ మే మూవీ. భారీ అంచనల మధ్య నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి రోజు ఏకంగా రూ.18 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక మూడురోజులోనే రూ.40 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇక సోమవారం కలెక్షన్స్ కాస్త తగ్గినా మళ్ళీ మంగళవారం ఊపందుకుంది. దాంతో, కేవలం ఐదు రోజుల్లోనే ఏకంగా రూ.71 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.

ఈ కలెక్షన్స్ చూసి బాలీవుడ్ మేకర్స్ అవాక్కవుతున్నారు. ఎందుకంటే, బాలీవుడ్ స్టార్స్ గా చెప్పుకుంటున్న హీరోలా సినిమాలు సైతం మినిమమ్ కలెక్షన్స్ రాబట్టడానికి ఇబ్బంది పడుతున్న తరుణంలో తమిళ స్టార్ ధనుష్ నటించిన ఈ సినిమాకు ఈ రేంజ్ లో కలెక్షన్స్ రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక తేరే ఇష్క్ మే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో మరోసారి ఆడియన్స్ ఒక విషయాన్ని ప్రూవ్ చేశారు. సినిమాల్లో స్టార్స్ ఉండటం కాదు.. కంటెంట్ మాత్రమే స్టార్ అయుండాలి. అదే ఆడియన్స్ కి కావాల్సింది అని. ఇక బాలీవుడ్ ట్రేడ్ వర్గాల మేరకు తేరే ఇష్క్ మే సినిమా రానున్న రోజుల్లో మరిన్ని వండర్స్ క్రియేట్ చేయనున్నట్టు చెప్తున్నారు. పక్కా యూత్ ఫుల్ కంటెంట్ కావడంతో సినిమా కలెక్షన్స్ రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉందని కామెంట్స్ చేస్తున్నారు.