Akhanda 2: అఖండ 2 ముందు భారీ టార్గెట్.. బ్రేకీవెన్ ఎంతో తెలుసా.. అంత కలెక్షన్స్ సాధ్యమేనా..

బాలకృష్ణ-బోయపాటి కాంబోలో వస్తున్న నాలుగవ సినిమా అఖండ 2(Akhanda 2). అఖండ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Akhanda 2: అఖండ 2 ముందు భారీ టార్గెట్.. బ్రేకీవెన్ ఎంతో తెలుసా.. అంత కలెక్షన్స్ సాధ్యమేనా..

Balakrishna Akhanda 2 Worldwide Business and Breakeven Details

Updated On : December 3, 2025 / 2:23 PM IST

Akhanda 2: నందమూరి బాలకృష్ణ అంటేనే మాస్ చిత్రాలకు కేరాఫ్ గా చెప్పుకుంటారు. ఆయన యాక్షన్, మాస్ డైలాగ్స్ ని ఆడియన్స్ ఒక రేంజ్ లో ఎంజాయ్ చేస్తారు. అలాంటి మాస్ కటౌట్ కి తగ్గ డైరెక్టర్ దొరికితే ఆ రిజల్ట్ ఎలా ఉంటుంది. ఆ ఊచకోత ఊహాహు కుడా అందదు కదా. ఆలా సెట్ అయిన మాస్ కాంబోనే బాలకృష్ణ-బోయపాటి కాంబో. సింహా లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో ఆ క్రేజీ కాంబో సెట్ అయ్యింది. ఆ తరువాత లెజెండ్, అఖండ సినిమాలతో హిట్ పెయిర్ గా సెట్ అయ్యింది. ఇప్పుడు ఈ కాంబోలో వస్తున్న నాలుగవ సినిమా అఖండ 2(Akhanda 2). అఖండ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tamil Star: తెలుగు సినిమాకి రూ.50 కోట్లు ఇవ్వాల్సిందే.. డిమాండ్ చేస్తున్న తమిళ స్టార్.. రెండు హిట్స్ ఇచ్చాడు మరి..

దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అదే రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. పాన్ ఇండియా లెవల్లో విడుదల అవుతున్న అఖండ 2 సినిమా అన్ని ఏరియాలు కలుపుకొని రూ.114 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో, ఇప్పుడు ఈ సినిమా ముందు భారీ టార్గెట్ ఉంది. ఆ టార్గెట్ ను అఖండ 2 సినిమా రీచ్ అవుతుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రూ.114 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది కాబట్టి ఈ సినిమా బ్రేకీవెన్ అవ్వాలంటే రూ.116 కోట్లకు పైగా వసూళ్లు సాధించాల్సిన అవసరం ఉంది.

ఇక్కడ ప్రేక్షకులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, అఖండ 2 అనేది పాన్ ఇండియా సినిమా. అలాగే సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి కాబట్టి, ఓపెనింగ్స్ భారీగానే వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ మధ్య కాలంలో డివోషనల్ కంటెంట్ తో వస్తున్న సినిమాలకు ఆడియన్స్ ఒక రేంజ్ లో కనెక్ట్ అవుతున్నారు. అలా అఖండ 2 సినిమాలో ఉన్న కోరే డివోషనల్ పాయింట్ గనక ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యింది అంటే రూ.116 కోట్లు అనేది చాలా సింపుల్ అనే చెప్పాలి. అలాగే, ఈ సినిమాకు కొంచం పాజిటీవ్ వచ్చినా పాన్ ఇండియా లెవల్లో భారీ కలెక్షన్స్ రావడం ఖాయం. ఇక ప్రస్తుతం ఉన్న ట్రేడ్ వర్గాల అంచనాల మేరకు అఖండ 2 సినిమా ఈజీగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ ఖచ్చితంగా కలెక్ట్ చేస్తుంది అంటూ చెప్తున్నారు. అలా అయితే, బాలకృష్ణ కెరీర్ లో అఖండ 2 బిగ్గెస్ట్ హిట్ అవడం ఖాయం అనే చెప్పాలి.