Ananya : హారర్ మూవీ ‘అనన్య’ ప్రమోషన్స్ కోసం శ్రీకాంత్.. రిలీజ్ అప్పుడే..
టాలీవుడ్ న్యూ హారర్ మూవీ 'అనన్య' ప్రమోషన్స్ లో హీరో శ్రీకాంత్. ఫ్యామిలీ అండ్ లవ్ ఎమోషన్స్‌తో..

Hero Srikanth in Tollywood new horror movie Ananya promotions
Ananya : టాలీవుడ్ లో మరో హారర్ కథాంశంతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమైన సినిమా ‘అనన్య’. ప్రసాద్ రాజు బొమ్మిడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హారర్ ఎలిమెంట్స్ తో పాటు ఫ్యామిలీ అండ్ లవ్ ఎమోషన్స్ లో కూడా కనిపించబోతున్నాయి. షూటింగ్ పనులు నుంచి సెన్సార్ వరకు అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు ప్రమోషన్స్ జరుపుకుంటూ రిలీజ్ కి సిద్దమవుతుంది.
ఇక ఈ మూవీ ప్రమోషన్స్ కోసం హీరో శ్రీకాంత్.. తనవంతు సాయం అందిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ ని చూసిన శ్రీకాంత్.. చిత్రం ఘన విజయం సాధించాలని, మూవీ టీంకి ఆల్ ది బెస్ట్ చెబుతూ అభిలషించారు. కాగా ఇటీవల రిలీజైన ఈ మూవీ ట్రైలర్.. లవ్, యాక్షన్ అండ్ హారర్ సీన్స్ తో ఇంటరెస్టింగ్ సాగింది. ఈ చిత్రం ఈనెల 22న విడుదల కానుంది.
Also read : Sandeep Reddy Vanga : కొత్త లుక్‌లో సందీప్ రెడ్డి వంగ.. ప్రభాస్ ‘స్పిరిట్’ గురించి కామెంట్స్..
కాగా ఈ సినిమాలో జయరామన్, చందన, తోషి అలహరి, ప్రజ్ఞ గౌతమ్, అరవింద్, సుమన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ సిద్ధి ధాత్రి మూవీ క్రియేషన్స్ పతాకం పై మొదటి సినిమాగా జంధ్యాల ఉమా నాగ శివ గంగాధర శర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్రినాద్ మంతెన సంగీతం అందిస్తున్నారు.