Sudheer Babu : తన పెళ్లి వీడియో షేర్ చేసిన సుధీర్ బాబు.. అప్పుడు మహేష్ ఎలా ఉన్నాడో చూడండి.. టాలీవుడ్ అంతా హాజరు..

తన పెళ్లి వీడియోని చిన్న గ్లింప్స్ గా కట్ చేసి సుధీర్ బాబు తాజాగా తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.

Hero Sudheer Babu Shares his Marriage Video it goes Viral

Sudheer Babu : హీరో సుధీర్ బాబు మన సూపర్ స్టార్ మహేష్ బాబుకి బావ అవుతాడని అందరికి తెలిసిందే. కృష్ణ కూతురు, మహేష్ చెల్లి పద్మ ప్రియదర్శినితో సుధీర్ బాబు వివాహం 2006లో జరిగింది. అప్పట్లో వీరి పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది. టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు అంతా హాజరయ్యారు ఆ పెళ్ళికి. అయితే తాజాగా సుధీర్ బాబు తన పెళ్లి వీడియోని షేర్ చేసారు.

Also Read : Janhvi Kapoor : దేవర సినిమాకు తెలుగులో జాన్వీ కపూర్ కి డబ్బింగ్ చెప్పిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?

తన పెళ్లి వీడియోని చిన్న గ్లింప్స్ గా కట్ చేసి సుధీర్ బాబు తాజాగా తన సోషల్ మీడియాలో ఈ వీడియో షేర్ చేసాడు. దీంతో ఈ పెళ్లి వీడియో వైరల్ గా మారింది. ఇందులో మహేష్ బాబు కొత్త దంపతులని ఆశీర్వదించడం, కృష్ణ ఫ్యామిలీ అంతా ఉండటంతో మహేష్ ఫ్యాన్స్ ఈ వీడియోని తెగ షేర్ చేస్తున్నారు. మీరు కూడా సుధీర్ బాబు పెళ్లి వీడియో చూసేయండి..

త్వరలో సుధీర్ బాబు ‘మా నాన్న సూపర్ హీరో’ అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ క్రమంలో ఆ సినిమా నుంచి ‘వేడుకలో ఉన్నది కాలం వేదిక ఈ కళ్యాణం..’ అంటూ ఓ పెళ్లి సాంగ్ రిలీజయింది. ఆ సినిమా పెళ్లి సాంగ్ ని తన పెళ్లి వీడియోకి జత చేసి ఇలా షేర్ చేసాడు సుధీర్ బాబు. మా నాన్న సూపర్ హీరో సినిమాలోని పెళ్లి సాంగ్ కూడా చూసేయండి..