Sundeep Kishan Interesting Comments about his relation with Suriya in Kanguva Event
Suriya – Sundeep Kishan : సందీప్ కిషన్ ఇప్పుడు హీరోగా వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. గతంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు రోల్స్, అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పలు సినిమాలు చేసాడు సందీప్ కిషన్. తాజాగా వైజాగ్ లో జరిగిన సూర్య కంగువా సినిమా ఈవెంట్ కి సందీప్ కిషన్ కూడా ఒక గెస్ట్ గా వచ్చారు.
ఈ ఈవెంట్లో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. నేను పుట్టి పెరిగింది చెన్నైలోనే. నా తెలుగు ఫ్రెండ్స్ అందరికి సూర్య అంటే ఇష్టం. తెలుగు వాళ్లకు ప్రాపర్ గా తమిళ్ సినిమాలు పరిచయం చేసింది సూర్య గారే. సూర్య గారికి గుర్తుందో లేదో నేను సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాను. అదే నా మొదటి సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ గా. ఫస్ట్ రెండు వారాలు ఆయనతో సరదాగా మాట్లాడాలన్నా అక్కడిదాకా వెళ్ళేవాడిని కాదు. ఆ సినిమాకు నేను 16వ అసిస్టెంట్ డైరెక్టర్ ని. ఏదో ఒకరోజు సింగిల్ గా కనిపిస్తే జస్ట్ హలో చెప్దామని ఎదురుచూసేవాడ్ని. అలా ఒక్కసారి దొరికారు. 45 నిముషాలు ఓ చివర కూర్చొని ఎమోషనల్ సీన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అప్పుడు అర్థమైంది యాక్టర్ అవ్వడం ఎంత కష్టమో తెలిసింది. ఆ రోజు ఆయన సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసి ఇవాళ ఆయన పక్కన అలా కూర్చోవడం చాలా ఆనందంగా ఉంది. నేను మొదటి సారి కెమెరా పెట్టడం, యాక్టింగ్ లైవ్ లో చూడటం అన్ని సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాలోనే సూర్య గారిని చూసే నేర్చుకున్నాను అని అన్నారు.