Suriya – Chiranjeevi : నేను ఇప్పటికే 6000 మంది పిల్లలని చదివించడానికి చిరంజీవి గారే కారణం.. మన హీరోల గురించి సూర్య ఏమన్నారంటే..
చిరంజీవి గురించి సూర్య మాట్లాడుతూ..

Suriya Inspirational Comments on Megastar Chiranjeevi goes Viral
Suriya – Chiranjeevi : తమిళ్ స్టార్ హీరో సూర్య త్వరలో కంగువా సినిమాతో పాన్ ఇండియా వైడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా నిన్న రాత్రి వైజాగ్ లో కంగువా సినిమా స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ ఈవెంట్లో సూర్య ని డైరెక్టర్ శివ మన తెలుగు హీరోల గురించి చెప్పమని అడిగారు. పలువురు హీరోల పేర్లు చెప్పి వాళ్ళ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు అని అడిగారు. దీంతో సూర్య మన హీరోల గురించి మాట్లాడారు.
Also Read : Anchor Sravanthi – Suriya : సూర్యకు మోకాళ్ళ మీద కూర్చొని ప్రపోజ్ చేసిన యాంకర్ స్రవంతి..
మన మెగాస్టార్ చిరంజీవి గురించి సూర్య మాట్లాడుతూ.. నాకు నేషనల్ అవార్డు వచ్చినప్పుడు నాకు అందరూ ట్విట్టర్లో, సోషల్ మీడియాలో విషెస్ చెప్పారు. కానీ నాకు చిరంజీవి గారు పర్సనల్ గా కాల్ చేసి విషెస్ చెప్పారు. అలాగే ఇంటికి డిన్నర్ పిలిచి ఫిష్ కర్రీ, దోశ ఆయన చేత్తో నాకు వడ్డించారు. నేను చెన్నైలో ఇల్లు కట్టుకోడానికి, నేను NGO మొదలు పెట్టడానికి చిరంజీవి గారే నాకు ప్రేరణ ఇచ్చారు. ఆయన వల్లే నేను ఇప్పుడు 6000 మందికి పైగా స్టూడెంట్స్ కి చదువు విషయంలో హెల్ప్ చేయగలిగాను. ఆయన నాకు ఇన్స్పిరేషన్. రీసెంట్ గా కలిసినప్పుడు కంగువా గురించి మాట్లాడారు అని తెలిపారు. దీంతో సూర్య చిరంజీవి గురించి మాట్లాడిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
అలాగే సూర్య మన హీరోల గురించి మాట్లాడుతూ.. ప్రభాస్ గురించి.. కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి అని అన్నారు. పవన్ కళ్యాణ్ గురించి.. ఆయన రీల్ లైఫ్, రియల్ లైఫ్ రెండిట్లోనూ ఒకేలా ఉంటారు. చాలా మంచి మనిషి అని పవన్ కళ్యాణ్ మెడపై చెయ్యి పెట్టుకునే యాటిట్యూడ్ చేసి చూపించారు. మహేష్ బాబు గురించి.. మేము ఇద్దరం ఒకే స్కూల్ లో చదివాము. మహేష్ నా కంటే జూనియర్. స్క్రీన్ పై అతని యాటిట్యూడ్ నాకు ఇష్టం అని అన్నారు. అల్లు అర్జున్ గురించి.. నేను అతని డ్యాన్స్ లకు పెద్ద అభిమానిని. మంచి హార్డ్ వర్కర్. పుష్ప 2 గురించి ఎదురుచూస్తున్నాను అంటూ తగ్గేదేలే అని అల్లు అర్జున్ లాగా చేసి చూపించారు. ఇక రామ్ చరణ్ గురించి.. అతను చేసింది 15 సినిమాలే అయినా ఆల్రెడీ అతను గ్లోబల్ స్టార్. అతను ఆల్రెడీ గ్లోబల్ యాక్టర్. నాకు తమ్ముడు లాంటి వాడు. అతని సక్సెస్ చూసి ఆనందిస్తున్నాను అని అన్నారు. ఎన్టీఆర్ గురించి.. ఎవరూ ఎన్టీఆర్ లాగా అచ్చ తెలుగు ఎవరూ మాట్లాడలేరు. స్క్రీన్ పై ఫుల్ ఎనర్జీగా ఉంటారు అని అన్నారు. దీంతో ఆ హీరోల ఫ్యాన్స్ సూర్య చేసిన వ్యాఖ్యలను వైరల్ చేస్తున్నారు.