Vijay Antony : జీవితాంతం చెప్పులు వేసుకోకుండా ఇలాగే ఉంటాను.. హీరో షాకింగ్ నిర్ణయం..

ఈ హీరో జీవితాంతం చెప్పులు వేసుకోకూడదని ఫిక్స్ అయ్యాడంట.

Hero Vijay Antony Decides not Wearing Slippers for Life Long

Vijay Antony : సాధారణంగా అందరం చెప్పులు వేసుకొనే తిరుగుతాము. మాలలో ఉన్నప్పుడో, గుడికి వెళ్ళినప్పుడో, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనో చెప్పులు వేసుకోము. కానీ జీవితాంతం చెప్పులు వేసుకోకుండా తిరిగేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. సాధువులు లాంటి వాళ్ళు తప్ప మాములు జనాలు అంతా కచ్చితంగా చెప్పులు వేసుకుంటారు. అయితే ఈ హీరో జీవితాంతం చెప్పులు వేసుకోకూడదని ఫిక్స్ అయ్యాడంట.

హీరో విజయ్ ఆంటోని బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయి ఆ తర్వాత తన ప్రతి సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల బిచ్చగాడు 2, లవ్ గురు సినిమాలతో తెలుగులో కూడా మంచి విజయం సాధించాడు. త్వరలో తుఫాన్ అనే సినిమాతో రాబోతున్నాడు విజయ్ ఆంటోనీ. తాజాగా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా ఈ ఈవెంట్లో ఆంటోని చెప్పులు లేకుండా కనపడ్డారు.

Also Read : Toofan Teaser : విజ‌య్ ఆంటోని ‘తుఫాన్’ టీజ‌ర్‌.. కొన్ని జీవితాలు త‌క్కువ అనే ఆలోచ‌న ప్ర‌పంచంలోని త‌ప్పులన్నింటికీ మూలం..

దీనిపై ప్రశ్నించగా విజయ్ ఆంటోని సమాధానమిస్తూ.. చెప్పులు లేకుండా బాగానే ఉంది. మొదట్లో కొంచెం పెయిన్ ఉంటుంది. ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ ఆ ఆతర్వాత చాలా ప్రశాంతంగా ఉంది. ఆరోగ్యానికి కూడా మంచిదే. జీవితాంతం ఇలాగే చెప్పులు లేకుండా ఉండాలని ఫిక్స్ అయ్యాను, కావాలంటే మీరు కూడా ట్రై చేయండి అని తెలిపారు.

అయితే ఇటీవల కొన్నాళ్ల క్రితం విజయ్ ఆంటోని కూతురు మరణించిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి ఆయన కొంచెం వేదాంతంగా మాట్లాడటం, జీవితం గురించి మాట్లాడటం చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారేమో అని భావిస్తున్నారు.