Toofan Teaser : విజయ్ ఆంటోని ‘తుఫాన్’ టీజర్.. కొన్ని జీవితాలు తక్కువ అనే ఆలోచన ప్రపంచంలోని తప్పులన్నింటికీ మూలం..
జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా చిత్రాలను చేస్తూ తనకంటూ ఓ ప్రత్ర్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ ఆంటోని.

Toofan Teaser
Vijay Antony Toofan Teaser : జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా చిత్రాలను చేస్తూ తనకంటూ ఓ ప్రత్ర్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ ఆంటోని. ఇటీవల ఆయన ‘లవ్ గురు’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. తాజాగా విజయ్ మిల్టన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోని నటిస్తున్న మూవీ ‘తుఫాన్’. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ పతాకంపై కమల్ బోరా, డి.లలితా, బి.ప్రదీప్, పంకజ్ బోరా లు నిర్మిస్తున్నారు.
పొయిటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ జోనర్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంతో శరత్‌కుమార్, సత్యరాజ్, డాలీ ధనుంజయ, మేఘా ఆకాష్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. అచ్చు రాజమణి, విజయ్ ఆంటోని సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర టీజర్‌ను తాజాగా విడుదల చేశారు.
Dulquer Salmaan : పవన్ OG కి పోటీగా దుల్కర్ సినిమా..
కొన్ని జీవితాలు తక్కువ అనే ఆలోచన ప్రపంచంలోని తప్పులన్నింటికీ మూలం అనే వ్యాఖ్యలతో టీజర్ ప్రారంభమైంది. ఎప్పడు ఏదో భయం ఉండేది..కానీ ఇప్పుడు అది లేదు. గుడికెళ్లి పడుకుంటే ప్రశాంతంగా ఉంటుంది కదా.. కంటికి కనిపించని ఓ వ్యక్తి ఎప్పుడు తోడుగా ఉన్నాడనే ఓ ధైర్యం.. అనే సంభాషణలు ఆకట్టుకున్నాయి. టీజర్ చూస్తుంటే మొత్తం యాక్షన్ ఎంటైర్‌టైనర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోందని అర్థమవుతోంది. మొత్తంగా టీజర్ ఆకట్టుకుంటోంది.