Dulquer Salmaan : పవన్ OG కి పోటీగా దుల్కర్ సినిమా..

మాలీవుడ్ స్టార్ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేయాల్సిన ప‌ని లేదు.

Dulquer Salmaan : పవన్ OG కి పోటీగా దుల్కర్ సినిమా..

Dulquer Salmaan Lucky Baskhar release date locked

Updated On : May 29, 2024 / 6:35 PM IST

Dulquer Salmaan – Pawan Kalyan : మాలీవుడ్ స్టార్ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేయాల్సిన ప‌ని లేదు. మ‌హాన‌టి, సీతారామం వంటి సినిమాల‌తో దుల్క‌ర్‌కు ఇక్క‌డ కూడా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. తాజాగా ఆయ‌న న‌టిస్తున్న మూవీ ల‌క్కీ భాస్క‌ర్‌. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ లో నాగ‌వంశీ, సాయి సౌజ‌న్య లు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

మీనాక్షి చౌదరి హీరోయిన్ గా న‌టిస్తోన్న ఈ చిత్రానికి జీవీ ప్ర‌కాశ్ సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా మూవీకి సంబంధించిన ఓ స‌రికొత్త అప్‌డేట్ చిత్ర బృందం విడుద‌ల చేసింది. సెప్టెంబ‌ర్ 27న ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు ఓ కొత్త పోస్ట‌ర్ ద్వారా వెల్ల‌డించింది. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం భాషల్లో ఈ చిత్రం విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో దుల్క‌ర్ క్యాషియ‌ర్‌గా న‌టిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇటీవ‌లే విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది.

Anand Deverakonda : సినిమా కోసం వేసిన సెట్ వర్షాలకు పడిపోయింది.. రష్మికతో కావాలనే అలా ప్లాన్ చేసాం..

కాగా.. అదే రోజున (సెప్టెంబ‌ర్ 27)న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టిస్తున్నOG మూవీ కూడా విడుద‌ల కానుంది. సాహో ఫేమ్‌ సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లింప్స్ తో OG సినిమాపై భారీ అంచనాలు నెల‌కొని ఉన్నాయి.