Hero Vishal Marriage: ఆ హీరోయిన్‌తో విశాల్ వివాహం.. పెళ్లి డేట్ కూడా ఫిక్స్.. ఎవరీ సాయి ధన్సిక..

ఇద్దరం అద్భుతమైన జీవితాన్ని ప్రారంభించబోతున్నాం. పెళ్లి తర్వాత కూడా ధన్సిక నటిస్తుంది..

Hero Vishal Marriage: హీరో విశాల్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. నటి సాయి ధన్సికను వివాహం చేసుకోబోతున్నాడు. దీనిపై వారు అధికారికంగా ప్రకటన చేశారు. పెళ్లి డేట్ ను సైతం అనౌన్స్ చేసేశారు. ఆగస్టు 29న వీరి పెళ్లి జరగనుంది. సాయి ధన్సిక తాజా తమిళ సినిమా యోగిదా. చెన్నైలో జరిగిన ఈ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ కు విశాల్‌, సాయి ధన్సిక కలిసి వచ్చారు. అదే వేదికపై పెళ్లి గురించి అధికారికంగా ప్రకటించారు. హీరో విశాల్ సాయి ధన్సికను వివాహం చేసుకోబోతున్నారంటూ కోలీవుడ్‌లో ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ ప్రచారమే నిజమైంది.

ఈ ఇద్దరికీ కొన్ని నెలల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ‘కబాలి’ సినిమాలో రజనీకాంత్ కూతురి పాత్రలో ధన్సిక నటించింది. తెలుగులో షికారు సినిమాతో టాలీవుడ్కు పరిచయమైంది. అంతిమ తీర్పు, దక్షిణ సినిమాల్లో హీరోయిన్ గా యాక్ట్ చేసింది.

విశాల్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటానని సాయి ధన్సిక చెప్పింది. సాయి ధన్సిక చాలా మంచి వ్యక్తి అని విశాల్ చెప్పాడు. ఇద్దరం అద్భుతమైన జీవితాన్ని ప్రారంభించబోతున్నామన్నాడు. పెళ్లి తర్వాత కూడా ధన్సిక నటిస్తుందని విశాల్‌ తెలిపాడు.

“కొన్ని నెలల క్రితమే మేము ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టాము. ఆగస్టు 29న వివాహం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాము. ఈరోజు మేము దీన్ని వెల్లడిస్తామని ఊహించలేదు. ఈ ఉదయం మా పెళ్లిపై మీడియాలో వార్తలు వచ్చాయి. దాంతో ఇకపై దాచకూడదని అనుకున్నాము. అంతా ఓపెన్ గా చెప్పేశాం. ఇప్పుడిక దాచడానికి ఏమీ లేదు” అని సాయి ధన్సిక చెప్పింది.

Also Read: తమన్నాతో బ్రేకప్ తర్వాత ఖరీదైన అపార్ట్మెంట్ కొన్న విజయ్ వర్మ.. ముంబైలో సముద్రం ఫేసింగ్ తో..

మే 11న తమిళనాడులోని విల్లుపురంలో జరిగిన అందాల పోటీలకు హాజరైనన విశాల్ సడెన్ గా కుప్పకూలిపోయాడు. దాంతో విశాల్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ‘యోగి దా’ ఆడియో లాంచ్ ఈవెంట్ లో విశాల్ చాలా సంతోషంగా, ఆరోగ్యంగా కనిపించాడు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కాగా, విశాల్ పెళ్లి గురించి గతంలో అనేక ప్రచారాలు జరిగాయి. వరలక్ష్మి, విశాల్ పెళ్లి చేసుకోబోతున్నారని ఒకసారి, అభినయ ను విశాల్ వివాహం చేసుకోబోతున్నాడని మరోసారి ప్రచారం జరిగింది.