Vishnu Vishaa
Vishnu Vishal : మొన్నటిదాకా హీరోయిన్స్ సినిమాల్లో, పాటల్లో, బయట ఫోటోషూట్స్ కోసం తమ అందాలని పరిచేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. హీరోలు కూడా మాకేం తక్కువా అంటూ అర్ధనగ్న ఫొటోలతో పాటు ఏకంగా న్యూడ్ ఫోటోలు కూడా షేర్ చేసేస్తున్నారు. ఇటీవల విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమా పోస్టర్ కోసం గులాబీలు అడ్డం పెట్టుకొని ఓ న్యూడ్ ఫోటో షేర్ చేశాడు. ఆ తర్వాత ఓ బ్రాండ్ ప్రమోషన్స్‌కి బాలీవుడ్ నటుడు రాహుల్ ఖన్నా అర్ధనగ్నంగా ఫొటోలు దిగాడు. వీల్లిదర్నీ ట్రోల్ చేసినా బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ఏకంగా ఓ మ్యాగజైన్ కోసం నగ్నంగా ఫొజులిచ్చి అందర్నీ షాక్ కి గురిచేశాడు. దీనిపై బాగా ట్రోల్స్ వచ్చాయి. రణవీర్ ని విపరీతంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Ranveer Singh : ఈ రచ్చ ఏందయ్యా.. వైరల్ అవుతున్న రణవీర్ సింగ్ న్యూడ్ ఫొటోషూట్
తాజాగా మరో హీరో కూడా ఇలాంటి న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రముఖ తమిళ హీరో, తెలుగులో అరణ్య, FIR సినిమాలతో మెప్పించిన విష్ణు విశాల్ తన న్యూడ్ ఫోటోలని ట్విట్టర్లో షేర్ చేశాడు. కొన్ని నెలల క్రితమే విష్ణు విశాల్ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, తెలుగు అమ్మాయి గుత్తా జ్వాలని వివాహం చేసుకున్నాడు. తాజాగా ఈ ఫోటోలని షేర్ చేసి.. ”నేను కూడా ఈ ట్రెండ్ లో జాయిన్ అయ్యాను. నా భార్య గుత్తా జ్వాల ఫొటోగ్రాఫర్‌గా మారి ఈ ఫోటోలు తీసింది” అని పోస్ట్ చేశాడు. ఇందులో నడుము కింద వరకు కనిపించేలా, దుప్పటి అడ్డుపెట్టుకుని ఫొటోలను పోస్ట్ చేశాడు. దీంతో ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. దీనిపైనా కూడా ట్రోల్స్ వస్తుండగా ఇంకా ఎంతమంది హీరోలు ఇలాంటి ఫొటోలు పోస్ట్ చేస్తారో అని కామెంట్స్ చేస్తున్నారు.
Well… joining the trend !
P.S
Also when wife @Guttajwala turns photographer… pic.twitter.com/kcvxYC40RU— VISHNU VISHAL (VV) (@TheVishnuVishal) July 23, 2022