గ్రీన్ ఛాలెంజ్- పార్క్‌లో మొక్కలు నాటిన విశ్వక్ సేన్
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన హీరో విశ్వక్ సేన్..

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన హీరో విశ్వక్ సేన్..
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విసిరిన ఛాలెంజ్‌ను యువ హీరో విశ్వక్ సేన్ స్వీకరించాడు.. ఈ ఛాలెంజ్‌లో భాగంగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద ఉన్న GHMC పార్క్‌లో విశ్వక్ సేన్ మొక్కలు నాటాడు..
‘మనిషి బ్రతకడానికి మొక్కలు ఎంతో అవసరం..ఎంపీ సంతోష్ కుమార్ చొరవ తీసుకొని గ్రీన్ ఛాలెంజ్ చేయడం చాలా గొప్ప పని’.. అంటూ ప్రశంసించిన విశ్వక్ సేన్.. అల్లు శిరీష్, అభినవ్ గోమటం, కార్తికేయ, డైరెక్టర్ శైలేష్(HIT)లకు ఛాలెంజ్ విసిరాడు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఛాలెంజ్ ప్రతినిధి రాఘవ పాల్గొన్నారు..
Read: ప్రభాస్‌కు ప్రతిష్ఠాత్మక అవార్డు.. దేశాల సరిహద్దులు దాటిన అభిమానం