Hero Yash's open letter saying that he wants to meet his fans
కేజీఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా వైడ్ ఫ్యాన్స్ ని సంపాదించుకున్న హీరో ‘యష్’కి కన్నడ ఫ్యాన్స్ ప్రాణం ఇచ్చేస్తారు. కేవలం తన సినిమాలు, నటనతోనే కాదు. తన మంచి మనసుతో, సేవ పనులతో కన్నడనాట ఎంతో అభిమానాన్ని సంపాదించుకున్నాడు. సాధారణంగా చాలా మంది హీరోలు తమ పుట్టినరోజు వేడుకలను తమ ఫ్యామిలీతో కలిసి చేసుకుంటారు. కానీ రాకీ భాయ్ మాత్రం ప్రతి ఏడాది జనవరి 8న తన బర్త్ డేని అభిమానుల మధ్య సెలెబ్రేట్ చేసుకుంటాడు.
Yash : 700 మందికి సెల్ఫీలు ఇచ్చిన రాకీ భాయ్..
అయితే ఈ ఏడాది యష్, ఫ్యాన్స్ ని కలవలేక పోతున్నాడు. ఆ విషయాన్ని అభిమానులకు తెలియజేస్తూ ఒక బహిరంగా లేఖ రిలీజ్ చేశాడు. “ఏడాది పొడవునా మరి ముఖ్యంగా నా పుట్టినరోజు సందర్భంగా మీరు చూపించే ప్రేమ, ఆప్యాయతలు నా హృదయాన్ని కృతజ్ఞతతో నింపేస్తుంది. సంవత్సరమంతా మీరు చూపించే ప్రేమని.. ఎంతోకొంత మీకు తిరిగి ఇవ్వడానికి నా పుట్టినరోజున మిమ్మల్ని కలవడం జరుగుతుంది.
కానీ ఈ సంవత్సరం నా పుట్టినరోజున నేను పట్టణంలో ఉండడం లేదు. దీంతో ఈసారి నేను మీ అందరినీ కలవలేకపోతున్నా. కానీ మాట ఇస్తున్న మిమ్మల్ని తప్పకుండా త్వరలో కలుస్తాను” అంటూ వెల్లడించాడు. కాగా కేజీఎఫ్ సినిమాలు తరువాత ఇప్పటి వరకు ఈ హీరో మరో సినిమా అనౌన్స్ చేయలేదు. మరి ఈ పుట్టినరోజున ఏమన్నా అప్డేట్ ఇస్తాడా అనేది చూడాలి. ఫ్యాన్స్ అయితే కేజీఎఫ్-3 కోసం ఎదురు చూస్తున్నారు.
To my fans,
With love
Yash pic.twitter.com/8Tm4j0Ubzi— Yash (@TheNameIsYash) January 5, 2023