Yash : 700 మందికి సెల్ఫీలు ఇచ్చిన రాకీ భాయ్..

'రాకీ భాయ్'గా ఇండియా వైడ్ పాపులారిటీని సంపాదించుకున్న హీరో 'యష్'. కన్నడ టెలివిజన్ రంగంలో కెరీర్ మొదలుపెట్టిన యష్.. ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ హీరో ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. తాజాగా బెంగుళూర్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హీరో యష్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ ఈవెంట్ లో రాకీ భాయ్ చేసిన పని చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు.

Yash : 700 మందికి సెల్ఫీలు ఇచ్చిన రాకీ భాయ్..

Rocky Bhai gave selfies to 700 people

Yash : ‘రాకీ భాయ్’గా ఇండియా వైడ్ పాపులారిటీని సంపాదించుకున్న హీరో ‘యష్’. కన్నడ టెలివిజన్ రంగంలో కెరీర్ మొదలుపెట్టిన యష్.. ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ హీరో ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. కేజిఎఫ్-1, కేజిఎఫ్-2 సినిమాలతో ఈ కన్నడ హీరో సౌత్ లోని మిగతా ఇండస్ట్రీలతో పాటు నార్త్ ఇండస్ట్రీలోనూ మార్కెట్ ని ఏర్పడుచుకున్నాడు. దీంతో ఈ హీరో తదుపరి సినిమాల కోసం రాకీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Yash: లోకేశ్‌తో రాఖీ భాయ్ భేటి.. వైరల్ అవుతున్న పిక్!

తాజాగా బెంగుళూర్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హీరో యష్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ ఈవెంట్ లో రాకీ భాయ్ చేసిన పని చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఈ కారిక్రమంలో అభిమానులు యష్‌తో ఫోటోలు దిగేందుకు ఎగపడ్డారు. ఈ క్రమంలో నిర్వాహకులు.. మొత్తం అందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగాలి అని సూచించగా, యష్ మాత్రం ఒక్కొక్కరికి సెల్ఫీలు ఇచ్చి అభిమానులను ఆనందపరిచాడు.

ఓపికగా సుమారు 700 మందితో విడివిడిగా ఫోటోలు దిగడంతో నెటిజెన్లు సోషల్ మీడియాలో.. “ఎంత ఎదిగిన ఒదిగి ఉండే రియల్ సూపర్ స్టార్ యష్” అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఫోటోలు దిగిన అభిమానులంతా ఆ పిక్స్ ని షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా కేజిఎఫ్ వంటి హిట్టు అందుకున్న యష్ ఇప్పటి వరకు మరో మూవీ మొదలుపెట్టలేదు. పాన్ ఇండియా ఇమేజ్ కి తగ్గ కథలు కోసం ఎదురు చూడడంతోనే లేటుకి కారణమని తెలుస్తుంది.