Heroine Amalapal birthday Husband shared a special video..
Amala Paul : ఒకప్పటి స్టార్ హీరోయిన్ అమలాపాల్ గురించి తెలిసిందే. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేసి భారీ గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ప్రస్తుతం సినిమాలకి బ్రేక్ ఇచ్చి ఫామిలీతో ఎంజాయ్ చేస్తుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా పలు సినిమాలు చేసి క్రేజ్ తెచ్చుకున్న ఈమె కమర్షియల్ సినిమాలే కాకుండా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ సైతం చేసింది.
Also Read : OG making video : ‘ఓజీ’ మేకింగ్ వీడియో విడుదల.. దర్శకుడి పుట్టిన రోజు స్పెషల్..
అలా వరుస సినిమాలు చేస్తున్న సమయంలో దర్శకుడు ఎల్ విజయ్ ను పెళ్లి చేసుకున్న ఈమె కొంత కాలానికి ఆయనతో విడిపోయింది. అనంతరం జగత్ దేశాయ్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని ఇప్పుడు ఓ పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. తల్లైన తర్వాత కూడా తన బోల్డ్ నెస్ తగ్గించలేదు ఈ బ్యూటీ. నిరంతరం తన ఫోటోలని షేర్ చేస్తూ ఉంటుంది.
అయితే నేడు ఆమె బర్త్ డే కావడంతో తన భర్త సోషల్ మీడియా వేదికగా ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేసాడు. ఇక అందులో.. నా అందమైన భార్య కి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇప్పుడు నువ్వొక అద్భుతమైన తల్లివి. మన ప్రేమ ఎప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నా, నువ్వు ఇలా ఎదగడాన్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. నీమీదున్న నా ప్రేమని మాటల్లో చెప్పలేను. నువ్వు ఎప్పుడూ ఇలానే సంతోషంగా, మరింత సక్సెస్ కి అర్హురాలివని నమ్ముతున్నాను అంటూ తెలిపారు.