×
Ad

Krithi Shetty: అన్యాయంగా నిందలు వేశారు.. సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. కన్నీళ్లు పెట్టుకున్న కృతి శెట్టి

ఉప్పనే సినిమాతో భారీ సక్సెస్ అందుకుంది కృతి శెట్టి(Krithi Shetty). ప్యూర్ లవ్ అండ్ ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించగా భారీ విజయం సాధించింది.

Heroine Krithi Shetty makes emotional comments on trolling

Krithi Shetty: ఉప్పనే సినిమాతో భారీ సక్సెస్ అందుకుంది కృతి శెట్టి(Krithi Shetty). ప్యూర్ లవ్ అండ్ ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించగా భారీ విజయం సాధించింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో, కృతికి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో, వరుస సినిమాలు ఒప్పుకుంది. కానీ, తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు అయ్యింది కృతి పరిస్థితి. మొదటి సినిమాతోనే భారీ విజయం సాధించింది. కానీ, ఆ విజయాన్ని మాత్రం కొనసాగించలేకపోయింది. కారణం ఏంటంటే, ఉప్పెన తరువాత ఈ బ్యూటీ నటించిన ఒక్కటంటే ఒక్క సినిమా కూడా విజయం సాధించలేదు. దీంతో ఈ అమ్మడిపై సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ నడించింది.

Sandeep Raj: నేను దురదృష్టవంతుడిని.. వెండితెర నన్ను అసహ్యించుకుంటుందేమో.. డైరెక్టర్ సందీప్ రాజ్ ఎమోషనల్ పోస్ట్..

ఐరన్ లెగ్ అటూ కామెంట్స్ చేశారు నెటిజన్స్. తాజాగా తనపై జరిగిన ట్రోలింగ్ పై ఎమోషనల్ కామెంట్స్ చేసింది కృతి శెట్టి. ప్రస్తుతం ఆమె హీరోయిన్ గా వస్తున్న సినిమా “వా వాతియార్” తమిళ స్టార్ కార్తీ హీరోగా వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. “నటనకి అపారమైన భావోద్వేగ శక్తి చాలా అవసరం. సినిమా కోసం అంతలా పని చేస్తున్నప్పుడు. ఎలాంటి కారణం లేకుండా ద్వేషాన్ని స్వీకరించడం భరించలేని విషయం. మన నియంత్రనాలో లేని విషయాలపై కూడా విమర్శల్ని ఎదుర్కోవడం బాధ కలిగిస్తుంది.

ఆ టైంలో వచ్చిన ట్రోల్స్‌ తీవ్రంగా బాధించాయి. ఒక దశలో నటన ఆపేద్దామని అనుకున్నా. నాకూ, నా తల్లిదండ్రులకీ సినిమా గురించి పెద్దగా తెలియదు. కాబట్టి, తీవ్రంగా ఒత్తిడికి గురయ్యాను. దాంతో జుట్టు రాలిపోవడం, చర్మ సమస్యలు ఎదుర్కొన్నాను. అవన్నీ చూసిన మా పేరెంట్స్ కష్టంగా ఉంటే చేయొద్దని అన్నారు. కానీ, ఉప్పెన సినిమాకు ప్రేక్షకుల నుంచి వచ్చిన ఆదరణ నాకు ఉత్సాహాన్నిచ్చింది అంటూ చెప్పుకొచ్చింది కృతి. దీంతో ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే, ‘వా వాతియార్’ తరువాత కృతి ప్రదీప్ రంగనాథన్ తో LIK(లవ్ ఇంష్యురెన్సు కంపెనీ) అనే సినిమాతో చేస్తోంది. విగ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.