Heroine Meena makes emotional comments about her second marriage
Meena: మీనా.. ఈ పేరు గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఉన్న దాదాపు అందరు స్టార్ హీరోస్ నటించి మెప్పించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఇదెలా ఉంటే.. తాజాగా నటి మీనా సీనియర్ హీరో జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న “జయమ్ము నిశ్చయమ్మురా” అనే టాక్ షోకి అతిథిగా హాజరైంది. తన లైఫ్ లో జరిగిన కొన్ని మరిచిపోలేని జ్ఞాపకాలను ఆడియన్స్ తో పంచుకుంది.
OG Song : పవర్ స్టార్ OG నుంచి.. అదిరిపోయే గన్స్ & రోజెస్ సాంగ్ వచ్చేసింది..
ఈ షోలో మీనా మాట్లాడుతూ.. “తక్కువ ఖర్చుతో సినిమాలు చేస్తామని న దగ్గరకు వచ్చేవారు. అవి సూపర్ హిట్ అయ్యేవి. తరువాత నన్ను మర్చిపోయేవారు. వరుస అవకాశాలు వస్తన్న సమయంలోనే పెళ్లి చేసుకున్నాను. పాప పుట్టింది. ఆ తరువాత రెండేళ్లకే దృశ్యం సినిమా కోసం నన్ను అడిగారు. పాప చిన్నది కావడంతో వదిలివెళ్లలేక నో చెప్పాను. కానీ, దర్శకుడు కథ రాసేటప్పుడు మిమ్మల్నే ఊహించుకుని రాశామని, వేరే వారితో సినిమా చేసే ఆలోచన లేదని చెప్పడంతో ఒప్పుకున్నాను”అంటూ చెప్పుకొచ్చింది మీనా.
అలాగే తన రెండో వివాహం గురించి కూడా మాట్లాడింది మీనా(Meena).. “నా భర్త చనిపోయిన తరువాత వారం రోజుల్లోనే నేను రెండో పెళ్లి చేసుకున్నానని రూమర్స్ స్పెర్డ్ చేశారు. ఆ సమయంలో చాలా బాధేసింది. అసలు వీళ్లకు కుటుంబాలు ఉండవా.. ఎందుకు ఇలా రాస్తున్నారు అనుకునేదాన్ని. అది చాలా కాలంలో కొనసాగింది. ఇండస్ట్రీలో ఎవరు విడాకులు తీసున్నా నాతో పెళ్లి అని రాశారు” అంటూ ఎమోషనల్ అయ్యింది మీనా. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.