×
Ad

Nivetha Pethuraj: మొన్నే కదా పెళ్లి అన్నారు.. అంతలో బ్రేకప్ చెప్పుకున్నారా?.. ఫోటోలు కూడా..

తన ప్రియుడిని పరిచయం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది నివేత పేతురాజ్(Nivetha Pethuraj). దుబాయ్‌కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త 'రజిత్‌ ఇబ్రాన్‌'తో రిలేషన్‌లో ఉన్నానని చెప్పింది.

Heroine Nivetha Pethuraj breaks up with boyfriend Rajhith Ibran

Nivetha Pethuraj: మెంటల్ మదిలో అనే సినిమాతో తెలుగునాట అడుగుపెట్టింది నివేత పేతురాజ్(Nivetha Pethuraj). ఆ తరువాత చిత్రలహరి, పాగల్, ధమ్కీ, అలా వైకుంఠపురంలో, రెడ్ సినిమాల్లో నటించింది. కానీ, అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది ఈ బ్యూటీ. ఆ తరువాత మలయాళం, తమిళ్ సినిమాల్లో కూడా నటించింది. కానీ, ఫేట్ మాత్రం మారలేదు. అక్కడ కూడా అంతగా విజయాలు వరించలేదు. దాంతో. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది ఈ బ్యూటీ. నేపధ్యంలోనే నివేత పెళ్లి చేసుకోబోతుందో అంటూ కూడా కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి.

Ram Charan: దేవుడా.. ఇదేం అభిమానం.. రామ్ చరణ్ ను చూడటానికి జపాన్ నుంచి వచ్చేశారు..

స్వయంగా నివేత పేతురాజ్ కూడా తన పెళ్లి గురించి చెప్పింది. ఆగస్టు నెలలో తన ప్రియుడిని పరిచయం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దుబాయ్‌కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ‘రజిత్‌ ఇబ్రాన్‌’తో రిలేషన్‌లో ఉన్నానని చెప్పింది. అలాగే, 2026 జనవరిలో పెళ్లి చేసుకోబోతున్నామని గుడ్‌న్యూస్‌ చెప్పింది. దీంతో, నివేత ఫ్యాన్స్ అందరు ఆమె పెళ్లికోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే, తాజాగా వీరి పెళ్లి గురించి షాకింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అదేంటంటే, పెళ్లి చేసుకోవాలనుకున్న ఈ జంట తాజాగా బ్రేకప్ చెప్పుకున్నారట. ఈ ఇద్దరు కలిసున్న తమ ఫోటోలను సోషల్‌ మీడియా నుంచి తొలగించేశారు. అలాగే, ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఒకరిని ఒకరు అన్‌ఫాలో చేసుకున్నారు. దీంతో వీరి పెళ్లి కూడా క్యాన్సిల్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై నివేదా పేతురాజ్‌ నుంచ్ నుంచి ఇంకా క్లారిటీ రాలేదు. మరి స్పందింస్తారా లేక నెటిజన్స్ అనుకుంటుంది నిజం చేస్తారా అనేది చూడాలి.