టాలీవుడ్ లో లైంగిక వేధింపులపై రాశీఖన్నా కామెంట్స్

  • Publish Date - March 2, 2019 / 01:47 PM IST

ఊహలు గుసగుసలాడె సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ రాశీఖన్నా. ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడినా.. అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అయితే అందుకు కారణం ఆమె వ్యక్తిత్వమేనని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. రాశీఖన్నా ఓ ఇంటర్వ్యూలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో వినపడుతున్న లైంగిక వేధింపులపై స్పందించారు. ఆమె మాట్లాడుతూ…వేధింపులకు గురౌతున్నవారు ముందుకు వచ్చి దైర్యంగా చెప్పడం చాలా గొప్ప విషయం అన్నారు. వారు ఎదుర్కొంటున్న చేదు అనుభవాలను బయటకు వచ్చి నిర్భయంగా చెప్పగలగడం మామూలు విషయం కాదని తెలిపారు. వాళ్ల ధైర్యాన్ని నిజంగా అభినందించాలన్నారు. ‘మీటూ’ అంటూ నాకు చెప్పుకోవడానికి ఏమీ లేదన్నారు రాశీఖన్నా.

‘ఊహలు గుసగుసలాడె’ సినిమాతో ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకూ నాకైతే.. అన్నీ మంచి అనుభవాలే ఎదురయ్యాయి’ అని చెప్పుకొచ్చారు. ‘టాలీవుడ్‌ ఈజ్‌ వన్నాఫ్‌ ది బెస్ట్‌ ఇండస్ట్రీస్‌’ అని.. ఇక్కడ మహిళ్నీ చాలా గౌరవిస్తారని… అలాగని వేధింపులు కూడా లేవని నేను స్పష్టంగా చెప్పలేను’ అని రాశీఖన్నా అన్నారు.