Sakshi Vaidya : ఏజెంట్ హీరోయిన్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేదో తెలుసా? ఏజెంట్ ఆఫర్ వస్తే స్కామ్ అనుకుందట..

ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ సాక్షి వైద్య తన గురించి ఆసక్తికర విషయాలను తెలిపింది.

Heroine Sakshi Vaidya shares about her life before agent movie

Sakshi Vaidya :  అక్కినేని అఖిల్, సాక్షి వైద్య(Sakshi Viadya) జంటగా, మమ్ముట్టి(Mammootty) ముఖ్య పాత్రలో సురేందర్ రెడ్డి(Surendar Reddy) దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కింది ఏజెంట్ సినిమా. అఖిల్ అక్కినేని(Akhil Akkineni) మొదటి సారి ఫుల్ మాస్, యాక్షన్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. నేడు ఏప్రిల్ 28న ఏజెంట్ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. గత కొన్ని రోజులుగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.

తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ సాక్షి వైద్య తన గురించి ఆసక్తికర విషయాలను తెలిపింది. సాక్షి వైద్య మాట్లాడుతూ.. నేను ఒక ఫిజియోథెరపిస్ట్ ని. కరోనా సమయంలో మొదట్లో ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక రీల్స్ చేశాను. అవి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొంతమంది ఆడిషన్స్ కి పిలిచారు. మా ఫ్రెండ్స్ కూడా సినిమాల్లో ట్రై చేయమని చెప్పడంతో కొన్ని సినిమాలకు ఆడిషన్స్ ఇచ్చాను. ఆఫర్స్ వచ్చినా ఆ పాత్రలు నాకు నచ్చలేదు. మళ్ళీ నేను నా వర్క్ లో బిజీ అయిపోయాను. ఓ సారి ఏజెంట్ సినిమా టీం నుంచి నాకు కాల్ చేసి హీరోయిన్ ఛాన్స్ అన్నారు. నాకు హీరోయిన్ ఛాన్స్ ఏంటి అనుకోని అదేదో స్కామ్ అనుకోని ఆ కాల్ ని లైట్ తీసుకున్నాను. కానీ నాకు పరిచయం ఉన్న ఓ కాస్టింగ్ డైరెక్టర్ అఖిల్ గురించి, AK ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ గురించి చెప్పడంతో హైదరాబాద్ కి వచ్చి ఆడిషన్ ఇచ్చాను. ఆడిషన్ లో ఓకే అయి హీరోయిన్ నేనే అని చెప్పాక అసలు నమ్మలేకపోయాను అని తెలిపింది.

Gopichand : గోపీచంద్ పాన్ ఇండియా.. నార్త్ లో కూడా రామబాణం రిలీజ్..

అలాగే.. ఏజెంట్ సినిమాలో పైలెట్ పాత్రలో కనిపిస్తాను. మొదటి సినిమానే అఖిల్ లాంటి హీరో, పెద్ద బ్యానర్ లో చేయడం మంచి అనుభూతునిచ్చింది. ప్రస్తుతం మరో తెలుగు సినిమా వరుణ్ తేజ్ సరసన గాండీవధారి అర్జున సినిమాలో నటిస్తున్నాను అని తెలిపింది ఈ మరాఠీ ముద్దుగుమ్మ.